తెలంగాణలో మూడేళ్ల బాలుడికి కరోనా

By సుభాష్  Published on  26 March 2020 7:48 AM IST
తెలంగాణలో మూడేళ్ల బాలుడికి కరోనా

తెలంగాణ రాష్ట్రంలో బుధవారం ఓ మూడేళ్ల బాలుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. దేశంలోనే తొలిసారిగా మూడేళ్ల బాలుడికి కరోనా పాజిటివ్ రావడం సంచలనం రేపుతోంది. తల్లిదండ్రులతో సౌదీ నుంచి హైదరాబాద్ కు రాగా, ఈ బాలుడుకి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రుల రక్త నమూనాలను సైతం సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. బాలుడితో పాటు తల్లిదండ్రులకు కూడా ఇండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వీరు హైదరాబాద్ లోని గోల్కొండలో నివాసం ఉంటున్నారు

మరో వైపు కోకాపేటకు చెందిన 43 ఏళ్ల మహిళకు కూడా పాజిటివ్ వచ్చింది. అలాగే ఆమె భర్త (49)కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆమె భర్త లండన్ నుంచి రాగా, ఆమె అక్కడే ఉంటోంది. అతని ద్వారా ఆమెకు కాంటాక్ట్ కావడంతో స్థానకంగా ఆందోళన కలిగిస్తోంది. కాగా, సికింద్రాబాద్ నుంచి ఒక వ్యాపారి కుటుంబంలో భార్యాభర్తలకు కరోనా రాగా, వారి ద్వారా కుమారుడికి కూడా సోకింది.

ఇక కొత్తగూడెం డీఎస్పీకి అతని కుమారుడి ద్వారా కరోనా సోకింది. మొత్తం ఇప్పటి తెలంగాణలో ఇప్పటి వరకు 41 మంది కరోనా బారిన పడ్డారు. అందులో ఆరుగురు విదేశీ వారు కాకుండా స్థానికంగా రెండో కాంటాక్ట్ ద్వారా వ్యాపించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇలా తెలగాణలో మరణాలు సంభవించకపోయినా.. పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో ఆందోళన కలిగిస్తోంది. నిన్న సాయంత్రం వరకు ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాకపోవడంతో అధికారులు కాస్త ఊపిరి పీల్చుకోగా, రాత్రి రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ రెండు కేసులతో మొత్తం 41కి చేరింది.

Next Story