భారత్‌లో 21లక్షల కేసులు.. 43వేల మరణాలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Aug 2020 5:35 AM GMT
భారత్‌లో 21లక్షల కేసులు.. 43వేల మరణాలు

భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా నిత్యం రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 64,339 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 861 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీటితో కలిపి దేశంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 21,53,000కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో 14,80,885 కోలుకుని డిశ్చార్జి కాగా.. 6,28,747 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ మహమ్మారి బారిన పడి 43,379 మంది ప్రాణాలు కోల్పోయారు.

ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 68.78 శాతంగా ఉండగా.. మరణాల రేటు 2.04శాతంగా ఉంది. కాగా, నిన్నటి వరకు మొత్తం 2,41,06,535 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్‌ వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్న దేశాల్లో భారత్‌ మూడో స్థానంలో ఉంది. అత్యధిక మరణాలు నమోదు అవుతున్న దేశాల్లో ఐదో స్థానంలో ఉంది.

Next Story
Share it