భారత్‌లో 19లక్షల కేసులు.. 39వేల మరణాలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Aug 2020 5:29 AM GMT
భారత్‌లో 19లక్షల కేసులు.. 39వేల మరణాలు

భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా నిత్యం 50వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 52,509 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 857 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీటితో కలిపి దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 19,08,255కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో 12,82,216 కోలుకుని డిశ్చార్జి కాగా.. 5,86,244 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ మహమ్మారి భారీన పడి 39,795 మంది మరణించారు. నిన్న 6,19,652 శాంపిళ్లను పరిక్షించగా.. మొత్తంగా 2,14,84,402 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది.

దేశంలో రికవరీ రేటు 67.19 శాతానికి పెరిగింది. దేశంలో అత్యధిక కేసులు నమోదు అవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. ఇప్పటి వరకు అక్కడ 4,57,956 కేసులు నమోదు కాగా.. ఆ తమిళనాడులో అత్యధికంగా 2,68,285 కేసులు నమోదు అయ్యాయి. దేశంలో మరణాల రేటు 2.09 శాతంగా ఉంది. ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు నమోదు అవుతున్న దేశాల్లో భారత్‌ మూడో స్థానంలో ఉండగా.. అత్యధిక మరణాలు నమోదు అవుతున్న దేశాల్లో భారత్‌ ఐదో స్థానంలో కొనసాగుతోంది.

Next Story