రెండు లక్షలు లంచం డిమాండ్‌ చేసి.. ఏసీబీకి బుక్కైన మహిళా ఎక్సైజ్‌ ఎస్సై

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Jun 2020 3:58 PM IST
రెండు లక్షలు లంచం డిమాండ్‌ చేసి.. ఏసీబీకి బుక్కైన మహిళా ఎక్సైజ్‌ ఎస్సై

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎక్సైజ్ శాఖలో ఏసీబీ దాడులు నిర్వహించారు. కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామం లోని లక్ష్మీనరసింహస్వామి వైన్స్ సమీపంలో దాబా అనుమతి కోసం ఎక్సైజ్ ఎస్సై సుస్మిత నిర్వాహకులను రెండు లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. దీంతో నిర్వాహకులు కవ్వంపల్లి సురేష్, తిరుపతి, సంజీవ్ లు ఏసీబీని ఆశ్రయించారు. దీంతో నేడు సిరిసిల్ల శివారులోని ఎల్లమ్మ టెంపుల్ ఆవరణలో కానిస్టేబుల్ రాజు రూ. 20 వేలు లంచం డబ్బులు తీసుకున్నాడు. ఏసీబీ అధికారులను గమనించిన కానిస్టేబుల్ రాజు పరారయ్యాడు. దీంతో ఎస్సై సుస్మిత, కానిస్టేబుల్ రాజులపై కేసు నమోదు చేశామని, కానిస్టేబుల్ రాజు పరారీలో ఉన్నాడని ఏసీబీ డిఎస్పి భద్రయ్య వెల్లడించారు.

Next Story