కరోనా డ్యాన్స్‌.!

By అంజి  Published on  3 Feb 2020 4:33 AM GMT
కరోనా డ్యాన్స్‌.!

నిన్న మొన్నటి దాకా భవిష్యత్ గురించి భయపడ్డారు. ఈ విపత్కర పరిస్థితులలో కనీసం పుట్టిన గడ్డ పైన అడుగు పెడతామా లేదా, కన్నవాళ్ళని కళ్లారా చూస్తామా లేదా అని ఆందోళన చెందారు. చావుకు దగ్గరవుతున్నామా అని క్షణక్షణం అనుకుంటూ బాధపడ్డ ఆ భారతీయులు భారత్‌లో అడుగుపెట్టిన ఆనందంతో ఎలా సందడి చేశారో చూడండి..

చైనాలోని నుంచి ఢిల్లీకి తిరిగి వఛ్చిన భారతీయుల్లో సుమారు 647 మందిని ఢిల్లీ సమీపంలోని మానెసార్ లో గల ప్రత్యేక కేంద్రంలో ఉంచారు. కరోనా వైరస్ అనుమానంతో వారిని ఈ ప్రపంచం నుంచి పూర్తిగా వేరు చేసి.. ఐసొ లేషన్ లో ఉంచినప్పటికీ వీరిలో చాలామంది స్పిరిట్, ఉత్సాహం మాత్రం తగ్గలేదు. ఈ కేంద్రంలో వీరు ముఖాలకు మాస్కులను ధరించే పాటలు పాడుతూ, డ్యాన్సులు చేస్తూ వీడియోకెక్కారు. వీరికి ప్రతిరోజూ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

కరోనా లక్షణాలేవీ లేవని తేలాక.. 14 రోజుల తరువాతే ఈ యువకులను వారి ఇళ్లకుపంపుతారు. అయితేనే వీరు భయంతో మూలాన కూర్చోకుండా తమని తామే ఉత్సాహపరచుకుంటున్నారు. పాటలకు డాన్స్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ్ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోపై చాలామంది ఈ వీడియో పై స్పందిస్తున్నారు.బీజేపీ నేత మేజర్ సురేంద్ర పూనియా ఈ వీడియో రీ ట్వీట్ చేశారు. కరోనా వైరస్‌ హర్యానా సంగీతానికి నృత్యం చేస్తోందన్నారు. చైనా నుంచి వచ్చిన విద్యార్థులు కరోనా వైరస్‌ గురించి భయపడటం లేదు, చిందులు వేయడం భేష్ అని, కరోనాకు కన్ను కుట్టేలా డాన్స్ చేస్తున్నారని కామెంట్ లు పెడుతున్నారు.



Next Story