నెట్టింట సందడి చేస్తున్న ఆర్జీవీ 'కరోనా వైరస్' ట్రైలర్
By తోట వంశీ కుమార్ Published on 26 May 2020 6:19 PM ISTకరోనా వైరస్ పై తెరకెక్కించిన మొదటి సినిమా తనదే అంటున్నాడు రామ్‌గోపాల్ వర్మ. కరోనా-లాక్‌డౌన్ పరిస్థితుల కారణంగా రెండు నెలల పాటు సినిమా షూటింగ్‌లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయినప్పటికి ఈ క్లిష్ట కాలంలోనూ కరోనా వైరస్ పేరుతో ఓ ఫీచర్ ఫిల్మ్ ను వర్మ పూర్తి చేశాడు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ విషయాన్ని వర్మ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించాడు. 'ఇదిగోండి ఇదే కరోనా చిత్ర ట్రైలర్. లాక్‌డౌన్ కాలంలోనే ఈ చిత్ర షూటింగ్ ను పూర్తిచేశాం. దేవుడే కాదు కరోనా వచ్చినా సరే మా పనిని ఆపలేరంటూ' వర్మ ట్వీట్ చేశాడు.
ట్రైలర్ మొదట్లో ఫోన్ రింగ్ అవుతుంది. అనంతరం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణలో పెరుగుతున్నా కరోనా బాదితుల సంఖ్య అంటూ బ్యాక్‌గ్రౌండ్ వాయిస్‌తో ట్రైలర్ స్టార్ అవుతుంది. మొత్తంగా ప్రస్తుత పరిస్థితులను చూపించే ప్రయత్నం చేశాడు వర్మ