కరోనా నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా..?

By సుభాష్  Published on  28 March 2020 6:26 PM IST
కరోనా నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా..?

కరోనా వైరస్‌ .. ఈ పేరు వింటేనే దడ పుట్టుకొస్తుంది. కరోనా వైరస్‌ సోకిన వ్యక్తి సాధారణంగా ఫ్లూ, జలుబు లాంటి వ్యాధుల నుంచి కోలుకున్న వారిలో రోగ నిరోధక శక్తి మెరుగ్గా ఉంటుంది. అందుకే ఫ్లూ నుంచి కోలుకున్న వ్యక్తికి మళ్లీ అంత త్వరగా రాదు. కరోనా మాత్రం తొందరగా మళ్లీ తిరగబడుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

జపాన్‌లో ఓ 70 ఏళ్ల వృద్ధుడికి కరోనా పరీక్షలు చేయగా, షాకింగ్‌ విషయాలు బయటకు వచ్చాయి. ఆయనకు కరోనా సోకినట్లు నిర్ధారణ కావడంతో ఫిబ్రవరిలో టోక్యో ఆస్పత్రిలో చికిత్స అందించారు. జపాన్‌ వార్తా సంస్థ ఎన్‌హెచ్‌కే కథనం ప్రకారం.. ఆయన కరోనా నుంచి కోలుకున్న తర్వాత బస్సుల్లో, రైళ్లల్లోనూ ప్రయాణం చేశారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఆయన మళ్లీ అనారోగ్యం బారిన పడ్డారు. జ్వరంగా ఉందని ఆయనను ఆస్పత్రికి తీసుకెళ్లగా, వైద్యులు పరీక్షలు నిర్వహించారు. దీంతో పరీక్షల్లో షాకింగ్‌ నిజాలు బయటపడ్డాయి. మళ్లీ రిపోర్టులో పాజిటివ్ వచ్చింది. జపాన్‌లో ఇలాంటి కేసులు చాలానే నమోదవుతున్నాయి. కరోనా నుంచి కోలుకున్న కొంత మందిలో మళ్లీ పాటిజివ్‌ వస్తోంది.

కరోనా నుంచి కోలుకున్న వారిలో కనీసం 14శాతం మందికి పరీక్షలు నిర్వహిస్తే మళ్లీ పాటిజివ్‌ వస్తోందని స్పానిష్‌ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ బయోటెక్నాలజీకి చెందిన అంటు వ్యాధుల నిపుణులు లూయిస్‌ ఎంజువానెస్‌ చెబుతున్నారు. వారానికే రెండోసారి సోకిందని చెప్పలేమని, వైరస్‌ తిరగబడటం వల్ల వారు మళ్లీ అనారోగ్యానికి గురవుతున్నారని పేర్కొన్నారు.

కోలుకున్న తర్వాత రోగనిరోధక శక్తి మెరుగు పడుతుంది

ఎక్కువ శాతం కరోనా బారిన పడిన వారిలో రోగనిరోధక శక్తి మెరుగు పడుతుంది. కానీ కొందరిలో అది బలహీనంగా ఉంటుంది. అలాంటి వారి శరీరంలో ఎక్కడో ఓ చోట వైరస్‌ ఉండి, మళ్లీ తిరగబడుతుందని ఎంజువానెస్‌ చెబుతున్నారు.

మూడు నెలల పాటు శరీరంలో..

కొన్ని కొన్ని వైరస్‌లు మన శరీరంలో మూడు నెలల పాటు, అంతకంటే ఎక్కువ కాలం జీవిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్న మాట. శరీరంలోని కణజాలంలో ఎక్కడో ఓ చోటు వైరస్‌ దాక్కునే అవకాశం ఉంది. అలాంటి సమయంలో శరీరం మళ్లీ దెబ్బతినవచ్చు. అలా దిగివున్నవున్న వైరస్‌ కొన్ని రోజుల తర్వాత పుంజుకునే అవకాశం ఉందని నిపుణులు లూయిస్‌ ఎంజువానెస్‌ పేర్కొంటున్నారు.

Next Story