ప్రపంచాన్ని గడ గడలాడిస్తున్న కరోనా మహమ్మారిని కేంద్ర ప్రభుత్వం విపత్తుగా ప్రకటించింది. కరోన విజృంభణను తట్టుకొని నిలిచేందుకు భారత్‌ ముమ్మర ప్రయత్నాలు మొదలు పెట్టింది. విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు, స్విమింగ్‌ ఫూల్స్‌ను ఈ నెల చివరి వరకు మూసివేయాలని నిర్ణయించింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ నిబంధనలు అమలు అవుతున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో సుప్రీంకోర్టులోనూ ముంద జాగ్రత్తగా ఆంక్షలు విధించారు. కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారికి అంత్యక్రియలు నిర్వహించే ఎలాంటి ఇన్‌ఫెక్షన్‌ సోకకుండా కేంద్ర ప్రభుత్వం మార్గ దర్శకాలను రూపొందిస్తోంది. అమెరికాలో కూడా ట్రంప్‌ ప్రభుత్వం హెల్త్‌ హెమర్జెన్సీని ప్రకటించింది. ఇక దేశంలో కరోనా బాధితుల సంఖ్య 84కు చేరింది. కరోనా వైరస్‌ సోకి ఇప్పటికే ఇద్దరు చనిపోయారు.

తొలుత కరోనా వైరస్‌ కారణంగా మృతి చెందిన కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియాను, ఆస్పత్రుల్లో అయ్యే ఖర్చులను కూడా భరిస్తామని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆ తర్వాత ఆ రెండు ఉత్తర్వులను కేంద్ర ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి ద్వారా.. వైరస్‌ సోకిన వారిని క్వారంటైన్‌లో ఉండే 30 రోజుల పాటు ఆహారం, వస్త్రాలు, వైద్య సేవలు అందించడానికి ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధులు వాడుకోవచ్చని తెలిపారు. దేశంలో వేగంగా వ్యాపిస్తున్న మహ్మమారి కరోనా వైరస్‌ను.. విపత్తుగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌ నమూనాల సేకరణ, తనిఖీలు, స్ర్రీనింగ్‌ కోసం జాతీయ ఆరోగ్య మిషన్‌ కింద నిధులను ఖర్చు చేయనున్నారు.

కొత్త ల్యాబ్‌లు, వైద్యులు, మున్సిపల్‌ సిబ్బంది, పోలీస్‌ సిబ్బంది రక్షణ కోసం ఉపయోగించే వస్తువులన్నింటిని, థర్మల్‌ స్కాన్లు, వెంటిలేటర్లు, ఎయిర్‌ఫ్యూరిఫయర్‌లు కూడా ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నుంచి మాత్రమే కొనుగోలు చేయాలని కేంద్ర తెలిపింది. రాష్ట్రంలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు ఎస్‌డీఆర్‌ఎఫ్‌ పర్యవేక్షిస్తుంటుంది. వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు తీసుకోవాల్సిన చర్యలకు అనుగుణంగా నిధులను ఖర్చు చేయాల్సి ఉంటుంది.

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో పద్మ ప్రదానోత్సవాలు వాయిదా పడ్డాయి. మార్చి 26, ఏప్రిల్‌ 3వ తేదీల్లో రాష్టపతి భవన్‌లో జరగాల్సిన ఈ వేడుకలను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. వివిధ రంగాల్లో కృషి చేసిన 141 మందికి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషన్‌ అవార్డులు ప్రకటించిన విషయం తెలిసిందే.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.