ఏడేళ్ల క్రితమే కరోనా..వ్యాక్సిన్ ఎందుకు కనిపెట్టలేదు ?
By రాణి Published on 28 March 2020 2:57 PM ISTఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ ను 2013లోనే గుర్తించారా ? గుర్తిస్తే..అప్పుడే ఎందుకు మందు కనిపెట్టలేదు ? సార్స్ కుటుంబానికే ఈ వైరస్ చెందిందని ఇప్పుడు గుర్తించిన శాస్త్రవేత్తలు..2013లో వ్యాక్సిన్ కనిపెట్టడంలో ఎందుకు అలసత్వం వహించారు ? ప్రస్తుతం ఈ విషయంపై అందరిలోనూ అనుమానాలు, విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచం మొత్తానికి వైరస్ వ్యాపిస్తే గానీ..దాని తీవ్రత ఏంటో అర్థం కాలేదా ? అన్న ప్రశ్నలకు సమాధానాలు లేవు.
Also Read : ఐసోలేషన్ వార్డులుగా రైలు బోగీలు
2013లోనే కరోనా వైరస్ ను గుర్తించారనడానికి అద్దం పడుతోంది అప్పట్లో ఈనాడులో ప్రచురితమైన కథనం. 2013, ఫిబ్రవరి 20వ తేదీన ‘కరోనా కలవరం:ఆరుకు చేరిన మృతులు’ అనే హెడ్ లైన్ తో ఈనాడు మెయిన్ ఎడిషన్ లోని ఒకపేజీలో వార్త ప్రచురితమైంది. ఈ వార్త సారాంశం ఏమిటంటే.. '' సార్స్ తరహా లక్షణాలతో వేధిస్తున్న కొత్తరకం వైరస్, ‘నోవెల్ కరోనావైరస్’కు బ్రిటన్‌లో ఒకరు మృతి చెందారని, బర్మింగ్‌హామ్‌లోని క్వీన్ ఎలిజిబెత్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న రోగి మరణించారని పేర్కొంది. గతేడాది మధ్య తూర్పు ప్రాంతంలో బయటపడిన ఈ కొత్తరకం వైరస్ బారిన పన్నెండు మంది పడ్డారని, వారిలో ఆరుగురు మృతి చెందారని తెలిపింది. ఈ కొత్త రకం వైరస్ వల్ల ప్రజానీకానికి ఎక్కువ ముప్పు పొంచి ఉందని, సాధారణ జలుబు, సార్స్, తీవ్రస్థాయి శ్వాసకోశ రుగ్మతలు దీని లక్షణాని పేర్కొంది. ఈ వైరస్ ఊపిరితిత్తుల మార్గాల పొరల్లోకి చొచ్చుకెళ్లి, రోగ నిరోధక వ్యవస్థపైదాడి చేస్తుందని, ఇది మానవ కణాల్లో సమర్థంగా పెరుగుతున్నట్లు స్విట్జర్లాండ్‌లోని కాంటోనల్ ఆసుపత్రి పరిశోధకులు వోల్కెర్ ధీల్ పేర్కొన్నారని తెలిపింది.''
Also Read : కన్నీటిని తెప్పించే కరోనా కథ.. ఈ కథ వెనుక మరో కథ
ఏడేళ్ల క్రితమే కరోనా వైరస్ బయటపడగా..ఇప్పుడు చైనా వారి వల్లే ఇది ప్రపంచానికి విస్తరించిందన్న వాదనలొస్తున్నాయి. చైనాలోని గబ్బిలాలకు ఈ వైరస్ ఉండగా..ఆ గబ్బిలాలను తిన్న పాముల్ని చైనా ప్రజలు తినడం వల్ల వైరస్ వచ్చిందన్నది ఇప్పుడున్న వాదన. అదే నిజమైతే ఏడేళ్ల క్రితం కరోనా వైరస్ ఎలా బయటపడింది ? అయితే అప్పట్లో ఈ వైరస్ ప్రభావం చాలా తక్కువగా ఉండటం వల్ల దీని గురించి పెద్దగా ఎవరూ పట్టించుకోకపోవడమే అసలు తప్పు. అప్పుడు చేసిన నిర్లక్ష్యమే ఇప్పుడు ప్రపంచ దేశాల్ని పట్టి పీడిస్తోంది. అప్పుడే ఈ వైరస్ కు వ్యాక్సిన్ ను కనుగొని ఉంటే..ఇప్పుడు ఈ వైరస్ వల్ల ఇన్ని వేల మంది ప్రాణాలు పోయేవి కాదు..లక్షల సంఖ్యలో బాధితులు ఆస్పత్రుల పాలయ్యేవారు కాదు. ఏదేమైనా చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనముంటుంది చెప్పండి..