కరోనా పరిణామాలు.. ఒడిదుడుకుల్లో స్టాక్‌ మార్కెట్లు..

By అంజి  Published on  16 March 2020 4:16 AM GMT
కరోనా పరిణామాలు.. ఒడిదుడుకుల్లో స్టాక్‌ మార్కెట్లు..

ముఖ్యాంశాలు

  • మళ్లీ కుప్పకూలిన మార్కెట్లు
  • 1,700 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌
  • 500 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ

ముంబై: కరోనా ఎఫెక్ట్‌తో మరోసారి స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలిపోయాయి. ఈ వారంలో మొదటి రోజున మన దేశీయ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభించాయి. కరోనా వైరస్‌ స్టాక్‌ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇవాళ ఉదయం 9.24 గంటల సమయంలో సెన్సెక్స్‌ 1753 పాయింట్లు నష్టపోయి.. 32,234 పాయింట్ల వద్ద కొనసాగింది. ఇక నిఫ్టీ 535 పాయింట్లు కిందకు రాగా 9419 వద్ద కొనసాగుతోంది.

Also Read: భారీగా తగ్గిన బంగారం ధర

ప్రస్తుతం డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.74.31గా ఉంది. గత వారం కూడా స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాలను ముట్టగట్టుకున్న విషయం తెలిసిందే. ఆ నష్టాల నుంచి ఈ వారంలో రికవరీ వస్తుందనుకున్నా.. ఆ దిశగా మాత్రం సూచీలు కదలలేదు. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న కరోనా భయమే ఇందుకు కారణమైందని స్టాక్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఇక అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లోల భారీ కోత విధించింది. అమెరికాలో కూడా మార్కెట్లు భారీ నష్టాల బాట పట్టాయి.

Also Read: స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుదారులకు షాక్‌..

Next Story