స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుదారులకు షాక్‌..

కొత్తగా మొబైల్‌ ఫోన్‌ కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి షాక్‌ తగలనుంది. కేంద్ర ఆర్థిక మంత్రికేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 39వ జీఎస్టీ మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొబైల్ ఫోన్లపై జీఎస్‌టీ రేటును 12 శాతం నుంచి 18 శాతానికి పెంచాలని పెంచారు. దీంతో మొబైల్‌ ఫోన్‌ రేట్లు పెరగనున్నాయి. ఏప్రిల్‌ 1 నుంచి ఈ ధరలు అమలులోకి రానున్నాయి.

విమానాల నిర్వహణ (ఎంఆర్‌ఓ) సేవలపై జీఎస్‌టీని 12 శాతంనుంచి 5 శాతానికి తగ్గించాలని కౌన్సిల్ నిర్ణయించగా, చేతితో తయారు చేసిన, యంత్రాలతో తయారు చేసిన అగ్గిపుల్లలపై ఉన్న పన్ను రేటును 12 శాతంగా వుంచింది. మరోవైపు రూ. 2 కోట్ల రూపాయల లోపు టర్నోవర్ ఉన్న సంస్థల 2018,2019 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన ఆలస్యంగా దాఖలు చేసిన వార్షిక రిటర్నులపై ఆలస్య రుసుమును రద్దు చేసింది. అలాగే 2020 జూన్ 30 వరకు జీఎస్‌టీఆర్ 9, జీఎస్‌టీఆర్‌ 9 సీ దాఖలు చేయడానికి గడువును పొడిగించింది. జూలై 2020 నాటికి జీఎస్టీ నెట్‌వర్క్‌ను మెరుగు పరచాలని మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు.

Vamshi Kumar Thota

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *