హైదరాబాద్‌ ఐటీ హబ్‌ను కరోనా వైరస్‌ తాకింది. మైండ్‌ స్పేస్‌ బిల్డింగ్‌లో పని చేస్తున్న ఓ మహిళకు కరోనా వైరస్‌ సోకింది. దీంతో ఎంప్లాయిస్‌ని సిబ్బంది ఇంటికి పంపిస్తున్నారు. డీఎస్‌ఎమ్‌ కంపెనీలో పని చేస్తున్న పరిమళ అనే మహిళకు కరోనా పాజిటివ్‌ అని తెలిసింది. ఆ మహిళ ఇటీవలే వేరే దేశం నుంచి వచ్చినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందిందన్న భయంతో.. మైండ్‌స్పేస్‌ పూర్తిగా ఖాళీ అయ్యింది. ఎప్పుడు హడావిడిగా కనిపించే మైండ్‌ స్పేస్‌లో ఒక్కసారిగా ప్రశాంత వాతావరణం నెలకొంది. మైండ్‌స్పేస్‌లోని ఓ కంపెనీలో 1000 మందికి వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఆప్షన్‌ పెట్టుకున్నట్లు సమాచారం.

రహేజా ఐటీ పార్క్‌లోని ఓ ఉద్యోగికి కరోనా లక్షణాలు ఉన్నట్లు అనుమానం వ్యక్తమవుతోంది. రహేజా పార్కులోని ఐటీ ఉద్యోగులను పోలీసులు ఇళ్లకు పంపుతున్నారు. కాగా సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో కరోనా పరీక్షలు నిర్వహించిన 45 మందికి నెగిటివ్‌ వచ్చిందని డీహెచ్‌ శ్రీనివాస్‌ తెలిపారు. మరో ఇద్దరి శాంపిల్స్‌ గురువారం వస్తాయని చెప్పారు. కరోనా వైరస్‌ కారణంగా మహేంద్రహిల్స్‌లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. మహేంద్రహిల్స్‌లో సిబ్బంది పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు.

భారత్‌లో ఇప్పటి వరకు 28 మందికి కరోనా వైరస్‌ ఉన్నట్లు గుర్తించామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్‌ అన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. కరోనా పాజిటివ్‌ కేసుల వచ్చిన ప్రదేశానికి మూడు కిలోమీటర్ల మేర శుభ్రత చర్యలు చేపట్టామన్నారు. ఢిల్లీలో పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి కుటుంబానికి కరోనా సోకినట్లు గుర్తించామన్నారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.