జైల్లో 120 మంది ఖైదీలకు కరోనా..!

By సుభాష్
Published on : 24 July 2020 12:50 PM IST

జైల్లో 120 మంది ఖైదీలకు కరోనా..!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య తీవ్ర స్థాయిలో పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. కరోనా కేసుల్లో ప్రపంచంలో భారత్‌ 3వ స్థానానికి చేరుకుంది. కరోనా కట్టడి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,87,945 చేరింది. ఇక పలువురు వైద్యులు, రాజకీయ నేతలు, పోలీసులు, ఇలా ఎవ్వరిని కూడా వదిలిపెట్టడం లేదు కరోనా.

కాగా, ప్రస్తుతం జైల్లో ఉంటున్న ఖైదీలకు సైతం కరోనా సోకుతుంది. తాజాగా ఉత్తర ప్రదేశ్‌లోని ఝాన్సీ జైల్లో ఉంటున్న 120 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్‌ తేలింది. దీంతో జైళ్లశాఖ వెంటనే అప్రమత్తమై వారిని క్వారంటైన్‌కు తరలించారు. వీరితో ఎవరెవరు కాంటాక్టు అయ్యారో వారికి కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక దేశ వ్యాప్తంగా కరోనా జాబితాలో ఉత్తరప్రదేశ్‌ ఆరో స్థానంలో ఉంది. ప్రస్తుతం అక్కడ 55వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 1200లకుపైగా మరణించారు.

Next Story