క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. భార‌త్ లోనూ ఈ మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. ఇక గ‌డిచిన 24 గంటల్లో కొత్త‌గా 1,533 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. మ‌రో 36 మంది మ‌ర‌ణించారు. దీంతో దేశంలో క‌రోనా కేసుల సంఖ్య‌ 17,265 కు చేర‌గా.. మృతుల సంఖ్య 543కి చేరింది. మొత్తం కేసుల్లో ఇప్ప‌టి వ‌ర‌కు 2,456 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా.. 14,175 మంది వివిధ ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుత‌న్నార‌ని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది.

ఇక మ‌హారాష్ట్ర‌లో ఈ మ‌హ‌మ్మారి తీవ్ర రూపం దాల్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు 4,203 కేసులు న‌మోదు కాగా.. 223 మంది మ‌ర‌ణించారు. ఆ త‌రువాత ఢిల్లీలో 2,003 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. 45 మంది మృత్యువాత ప‌డ్డారు. గుజరాత్‌లో 1,743, మధ్యప్రదేశ్‌లో 1,407, రాజస్తాన్‌లో 1,478 , తమిళనాడులో 1,477, ఉత్తరప్రదేశ్‌లో 1,084 రాష్ట్రాల‌లో వెయ్యికి పైగా కేసులు న‌మోద‌య్యాయి. ఇక తెలుగు రాష్ట్రాల విష‌యానికి వ‌స్తే.. తెలంగాణ రాష్ట్రంలో 858 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. 21 మంది మృత్యువాత ప‌డ్డారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కేసుల సంఖ్య 647కి చేర‌గా.. 18 మంది మ‌ర‌ణించారు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.