కాలజ్ఞానంలో కరోనా.. అవన్నీ నిజాలు కాదట..
By అంజి Published on 28 Feb 2020 4:13 AM GMTముఖ్యాంశాలు
- కరోనా గురించి బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పేశారా?
- అదంతా ఒట్టి ప్రచారమేంటున్న జేవీవీ
- కాలజ్ఞానాన్ని వదలని తెలుగు రాజకీయాలు
హైదరాబాద్: 'కాలజ్ఞానంలో కరోనా?' అంటూ ఓ దినపత్రిక కథనం రాసింది. ఆ కథనం మేరకు.. చైనాలో విజృంభించి 46 దేశాలకు పాకిన కరోనా వైరస్ గురించి పోతులూరి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పారని సోషల్ మీడియాలో ఓ పోస్టు ఇటీవల కొన్ని రోజుల నుంచి తెగవైరల్ అవుతోంది. బ్రహ్మంగారు చెప్పిన ఓ పద్యంతో.. కరోనా వైరస్‌ను ముడిపెడుతూ సోషల్ మీడియాలో ఓ పోస్టు చక్కర్లు కొడుతోంది. కలియుగంలో జరిగే అనర్థాల గురించి బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారని.. వాటికి ఇప్పటికి కొందరు నమ్ముతూ ఉంటారు. అయితే అదంతా ఒట్టి ప్రచారం మాత్రమేనని జన విజ్ఞాన వేదిక, హేతువాదులు అంటున్నారు. అయితే, నాటి సమాజాంలో ప్రగతి శీల పాత్ర పోషించిన బ్రహ్మంగారి పేరుతో కట్టు కథలను చెలామణిలోకి తేవడం కరెక్ట్ కాదని హేతువాదులు చెబుతున్నారు. ఇది పూర్తిగా దుష్ప్రచారమని జేవీవీ పైర్వ ప్రధాన కార్యదర్శి కేఎల్ కాంతారావు కొట్టిపడేస్తున్నారు. కాగా బ్రహ్మంగారి కాలం జ్ఞానంను రాజకీయంగా కూడా వాడుతున్నారు. వికారి నామ సంవత్సరంలో రాజన్న రాజ్యం వస్తుందని.. చంద్రబాబు ఓడిపోతారని ఆయన చెప్పాడని.. ఓ పోస్టు సోషల్ మీడియాలో అప్పట్లో చక్కర్లు కొట్టడమే దీనికి నిదర్శనం.
ఈశాన్య దిక్కున విషగాలి పుట్టేను
లక్షలాది ప్రజలు సచ్చేరయ
కోరంకియను జబ్బు కోటిమందికి తగిలి
కోడిలాగ తూగిసచ్చేరయ IIశివII 114
అవన్నీ నిజాలు కాదట..
ఆవుపాలు కొన్ని రకాల క్యాన్సర్లను నయం చేస్తాయని, గోవు మూత్రం అన్ని రోగాలకు నివారిణి అని, సెల్‌ఫోన్ రేడియేషన్‌ను అడ్డుకునే శక్తి ఒక్క గోవు పేడకు మాత్రం ఉందంటూ కొందరు మూఢ నమ్మకాలను నమ్ముతుంటారు. కొందరు వీటితో చెలగాటమాడి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారని.. శాస్త్రవేత్త బాబు రావు తెలిపారు. గో మూత్రంపై సీసీఎంబీ పూర్వ అధ్యక్షుడు డి.బాలసుబ్రహ్మణ్యన్ విస్తృత అధ్యయనం చేశారు. ఔషధ గుణాలు, పోషకాలు కూడా అందులో ఉండవని పరిశోధనా పత్రాలను వెలువరించారు. సోషల్ మీడియాలో అశాస్త్రీయ అంశాలను సైన్స్‌గా చెబుతూ.. దుష్ప్రచారం చేస్తున్నారని బ్రేక్ త్రూ సైన్స్ సొసైటీ కన్వీనర్ ఆచార్య ఆర్.గంగాధర చెబుతున్నారు.
బ్రహ్మంగారు అభ్యదయవాది అని జేవీవీ చెందిన కేఎల్ కాంతారవు చెప్పారు. 8 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకోమ్మంటే అప్పట్లోనే బ్రహ్మంగారు దానిని తిరస్కరించారని చెప్పారు. ఆయన పేరుతో అశాస్త్రీయ అంశాలపై దుష్ప్రచారం తగదన్నారు. మఠం నిర్వహకులు కొన్ని జరిగిన విషయాలను పుస్తకాల్లో ముద్రిస్తారు. వాటికి ఇష్టమొచ్చినట్లు జోడిస్తే అది వెర్రితనమేనని ఆయన చెప్పారు.