ఏపీలో వెయ్యి దాటిన క‌రోనా కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 April 2020 7:02 AM GMT
ఏపీలో వెయ్యి దాటిన క‌రోనా కేసులు

ఏపీలో క‌రోనా వైర‌స్ విజృంభిస్తోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 61 పాజిటివ్‌లు కేసులు న‌మోదు కాగా , ఇద్ద‌రు మృతి చెందార‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్‌లో తెలిపింది. కొత్త‌గా న‌మోదైన కేసుల‌తో క‌లిసి రాష్ట్రంలో క‌రోనా కేసుల సంఖ్య 1016కి చేరింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారి భారీన ప‌డి 31 మంది మృతి చెందారు. మొత్తం న‌మోదైన కేసుల్లో 171 మంది డిశ్చార్జి అయి ఇంటికి వెళ్ల‌గా ప్ర‌స్తుతం 814 మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు.

విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్క క‌రోనా కేసులు న‌మోదు కాలేద‌ని బావిస్తున్న త‌రుణంలో ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో మూడు కేసులు న‌మోదు కావ‌డం ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. ఈ రోజు న‌మోదైన కేసుల్లో అత్య‌ధికంగా కృష్ణా జిల్లా నుంచి 25 న‌మోదు కాగా, క‌ర్నూలు 14, అనంత‌పురం 5, ఈస్ట్ గోదావ‌రి 3, గుంటూరు 3, నెల్లూరు 4, శ్రీకాకుళం 3 చొప్పున కేసులు న‌మోద‌య్యాయి. Untitled 1

Next Story
Share it