కరోనా ట్రాకింగ్ యాప్..పోలీసుల వినూత్న ఆలోచన
By రాణి Published on 28 March 2020 6:55 PM ISTకరోనాను కట్టడి చేసేందుకు దేశ వ్యాప్తంగా ఏప్రిల్ 14వ తేదీ వరకూ లాక్ డౌన్ విధించారు ప్రధాని నరేంద్రమోదీ. కేంద్రం కన్నా ముందు తెలుగు రాష్ట్రాల సీఎంలు మార్చి నెలాఖరు వరకూ లాక్ డౌన్ ప్రకటించారు. తాజాగా తెలంగాణ సీఎం ఈ గడువును ఏప్రిల్ 15కు పొడిగించారు.
Also Read : కరోనా బాధితుల వివరాలు షేర్ చేస్తే జైలుకే..
కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు ప్రజలంతా ఇళ్లకే పరిమితవ్వాలి. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు. నిత్యావసరాల కోసం కుటుంబానికి ఒక వ్యక్తే బయటకు రావాలి. ఇవి..ప్రభుత్వాలు జారీ చేసిన జాగ్రత్తలు, ఆదేశాలు. వీటిని అమలు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. అనవసరంగా బయటకు వచ్చారని తెలిసిన వారికి కొందరు లాఠీ తో బుద్ధి చెప్తుంటే..మరికొందరు పోలీసులు చిన్నప్పుడు స్కూల్ లో ఇచ్చిన పనిష్మెంట్లను గుర్తు చేస్తున్నారు. గుంజీలు తీయించడం, ఎర్రటి ఎండలో మోకాలి దండ, గోడకుర్చీలు వేయిస్తున్నారు. కొన్నిచోట్లైతే రోడ్డుపైనే పొర్లు దండాలు పెట్టిస్తున్నారు. ఎన్ని చేసినా ఏం లాభం. దున్నపోతు మీద వానకురిసినట్లు..తుడుచుకుని వెళ్లిపోతున్నారు. తర్వాతి రోజు షరా మామూలే.
Also Read : కోహ్లీ కొత్త హెయిర్‌స్టైలిస్ట్‌ను చూశారా..
దీంతో విసిగిపోయిన కర్నూల్ పోలీసులు వినూత్న ఆలోచన చేశారు. కరోనా ట్రాకింగ్ యాప్ ను కనిపెట్టారు. అది రోడ్డుపై కనిపించిన వారికి ఫోన్లలో ఇన్ స్టాల్ చేస్తున్నారు. నిత్యావసరాల కోసం, అత్యవసర పనులను నిర్వర్తించుకునేందుకు ఉదయం 6 నుంచి సాయంత్రం 1 గంట వరకే అనుమతి. ఆ తర్వాత ఎవరైతే రోడ్లపై తిరుగుతారో..వారిని ఈ ట్రాకింగ్ ద్వారా గుర్తించి కఠినంగా శిక్షిస్తారట. ఇదండీ సంగతి. ట్రాకింగ్ యాప్ నుంచి ఎవరూ తప్పించుకోలేరు కదా. ఒక వేళ అన్ ఇన్ స్టాల్ చేసినా తెలిసిపోతుందట. జర జాగ్రత్త మరి. కర్నూల్ పోలీసోళ్ల లాఠీ దెబ్బలు తినాలనుకుంటే..ఇష్టారాజ్యంగా బయట తిరగొచ్చు.