కరోనా సమయంలోనే హనీమూన్ చేసుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే!!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  3 March 2020 6:30 AM GMT
కరోనా సమయంలోనే హనీమూన్ చేసుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే!!

ఇప్పుడు కరోనా ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. టూరిజం డెస్టినేషన్లు టెర్రర్ స్పాట్లుగా మారిపోతున్నాయి. చెట్టాపట్టాలు వేసుకుని హనీమూన్ చేసుకొద్దామనుకుంటే కరోనా అంటించుకుని మరీ వచ్చే రోజులివి. మరి ఇలాంటి పరిస్థితుల్లో కొత్త దంపతులు హనీమూన్ ఎక్కడికి వెళ్లాలి? అంటువ్యాధి భయం లేకుండా ఎలా ఆనందాన్ని పొందాలి? అందుకే ఇదిగో ఈ సలహాలను పాటించండి....!!

వెళ్లకూడని ప్రదేశాలుః గ్రీస్, ఇటలీ, థాయిలాండ్, ఫ్రాన్స్, సింగపూర్ లకు ఇప్పుడు అస్సలు వెళ్లకండి. ఈ దేశాలన్నీ కరోనా గుప్పెట్లో ఉన్నాయి. వేల సంఖ్యలో రోగులు హాస్పిటల్స్ లో భర్తీ అవుతున్నారు. చనిపోయిన వారి సంఖ్య కూడా పెరుగుతోంది. చాలా దేశాలు ఈ దేశాలతో రాకపోకలను కూడా నిషేధించాయి.

టూరిజం ఆపరేటర్ల మాట వినండిః మీ హనీమూన్ జరుపుకునే ముందు టూర్ అండ్ ట్రావెల్ ఆపరేటర్లు ఏం చెబుతున్నారో వినండి. వివిధ నిషేధాల కారణంగా పలు దేశాలకు ఇప్పుడు వెళ్లడం కుదరదు. అందుకే వారు సజెస్ట్ చేస్తున్న టూరిస్టు స్పాట్లకు వెళ్లడమే మంచిది. ప్రపంచంలో వివిధ దేశాలనుంచి వస్తున్న అలెర్ట్ ల ఆధారంగా వారు సలహాలు ఇస్తారన్నది గుర్తుంచుకొండి. గ్రీస్, ఇటలీ వంటి దేశాలకు చేసుకున్న బుకింగ్ లు అన్ని క్యాన్సిల్ అయిపోయాయి. థాయిలాండ్, సింగపూర్లకు చేసుకున్న బుకింగులు నూటికి నూరు శాతం క్యాన్సిల్ అయిపోయాయి.

మరి ఎక్కడికి వెళ్లాలిః టూరిజం అండ్ ట్రావెల్స్ వారి కథనం ప్రకారం రానున్న మూడు నెలల్లో 70 శాతం హనీమూన్ ట్రిప్పులు మాల్దీవ్స్, మారిషస్ లాంటి ద్వీప దేశాలకు బుక్ అయిపోయాయి. అందరూ ఇలాంటి స్పాట్స్ కే వెళ్లాలనుకుంటున్నారు. ట్రావెల్స్ సంస్థలు ఇప్పుడు రష్యా, చెక్ రిపబ్లిక్, న్యూజాలాండ్, ఈ జిప్ట్, జో్ర్డాన్, టాంజానియా, సౌత్ ఆఫ్రికా వంటి దేశాలకు వెళ్లమని చెబుతున్నారు. ఆ దేశాల్లో ఇప్పటి వరకూ కరోనా కేసులు నమోదు కాలేదు. మాల్దీవ్స్, మారిషస్ లు కూడా ఆహ్లాదానికి ఆహ్లాదం, ఆరోగ్యానికి ఆరోగ్యం ఇవ్వగలుగుతాయని టూర్ ఆపరేటర్లు అంటున్నారు. పొరుగున ఉన్న శ్రీలంక కూడా హనీమూన్ వెళ్లడానికి చాలా అనుకూలం.

మరి మన దేశంలోః అసలంత దూరం ఎందుకు కరోనా వ్యాధి ప్రబలుతున్న సమయంలో అసలు విదేశాలకు ఎందుకు అనుకుంటే రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, అండమాన్. నికోబార్ వంటి ప్రదేశాలకు హాయిగా వెళ్లవచ్చు. అండమాన్ లో నైతే మనకు మాల్దీవ్స్, మారిషస్ లలో ఉన్న ఫీలింగ్ కూడా వచ్చేస్తుంది. హాయిగా బీచ్ లలో సేద తీరవచ్చు.

Next Story