మియాపూర్‌లో అగ్నికి దగ్ధమైన శానిటైజర్ లారీ
By సుభాష్Published on : 22 April 2020 9:13 PM IST

శానిటైజర్ ద్రావణాన్ని తరలిస్తున్న ఓ లారీ మియాపూర్‌లో ప్రమాదవశాత్తు దగ్ధమైంది. జీడిమెట్ల నుంచి సంగారెడ్డి వైపు వెళ్తున్న ఈ లారీ.. మియాపూర్‌కు రాగానే ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. గమనించిన డ్రైవర్, క్లీనర్‌లు లారీ దిగి పరారయ్యారు. ఇక సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలనికి అగ్నిమాపక శకటాలతో వచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
అయితే కరోనాను కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం శానిటైజర్ ద్రావణాన్ని హైదరాబాద్‌తోపాటు అన్ని జిల్లాల్లోనూ స్పే చేస్తుంది.
Next Story