జర్నలిస్టుకు కరోనా పాజిటివ్..!
By Newsmeter.Network Published on 25 March 2020 11:28 AM GMTదేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుంది. ఇప్పటి వరకు అధికశాతం విదేశాల నుంచి వచ్చిన వారిలో ఈ వైరస్‌ను గుర్తించిన వైద్యులు, ఇప్పుడు వచ్చే పాజిటివ్ కేసులు అధికంగా స్వదేశంలో వారేనని, దీనిని బట్టి చూస్తుంటే వైరస్ ఒకరి నుంచి ఒకరికి వేగంగా విస్తరిస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు. బుధవారం మధ్యాహ్నం నాటికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 595కు చేరింది. బుధవారం ఐదు కేసులు నిర్ధారణ కాగా వీరిలో ఎవరూ విదేశాలకు వెళ్లిన దాఖలాలు లేవని ఇండోర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ప్రవీణ్ జదియా అన్నారు. వీరిలో 50ఏళ్లు, 65ఏళ్లు ఇద్దరు మహిళలు, 48ఏళ్లు, 65ఏళ్లు, 68ఏళ్లు ముగ్గురు పురుషులు ఉన్నారు. వైరస్ నిర్ధారణ అయిన 65 ఏళ్ల మహిళలది ఉజ్జయినిగా గుర్తించారు.
Also Read :బీజేపీ ఎత్తులకు కాంగ్రెస్ నిలవలేదా?.. కాంగ్రెస్ పెద్దల నిర్లక్ష్యంతోనే ‘ఎంపీ’ చేజారిందా..?
ఇప్పటికే కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ లాక్‌డౌన్‌కు పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే మధ్య ప్రదేశ్‌కు చెందిన ఓ జర్నలిస్టుకు కరోనా పాజిటివ్ వచ్చింది. తన కూతురి ద్వారా అతడికి వైరస్ సోకినట్లు అధికారులు గుర్తించారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తూ కమల్‌నాథ్ చివరిసారిగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సదరు జర్నలిస్టు పాల్గొన్నాడు. దీంతో అధికారులు అప్రమత్తమై ఆ సమావేశంలో పాల్గొన్న జర్నలిస్టును అప్రమత్తం చేశారు. ఆ సమావేశంలో హాజరైన జర్నలిస్టులందరూ స్వీయగృహనిర్బంధంలోకి వెళ్లాలని సూచించారు. దీంతో ఆ ప్రాంతంలో జర్నలిస్టులతో పాటు స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.