సినీ దంపతులకు కరోనా పాజిటివ్..

By రాణి  Published on  12 March 2020 11:39 AM IST
సినీ దంపతులకు కరోనా పాజిటివ్..

సుమారు వందకు పైగా దేశాలను హడలెత్తిస్తోన్న శత్రువు కరోనా వైరస్. ఇది ఇప్పుడు యావత్ ప్రపంచ దేశాలన్నింటికీ ఉమ్మడి శత్రువైంది. తెలంగాణలో తొలి కరోనా బాధితుడు కోలుకున్నాడనుకునేలోపు..మరో ఇద్దరు కరోనా అనుమానితులు గాంధీలో చేరారు. తాజాగా..ఓ సినీ దంపతులకు కరోనా నిర్థారణయింది. ఆస్కార్ విజేత, హాలీవుడ్ నటుడు టామ్ హాంక్స్, అతని భార్య నటి రిటా విల్సన్ లకు కరోనా పరీక్షలు నిర్వహించగా..పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం వీరిద్దరూ ఆస్ర్టేలియాలోని ఒక ఆస్పత్రిలో ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.

Tom Hanks Rita Wilson

సినిమా షూటింగ్ కోసం ఆస్ర్టేలియా వెళ్లిన ఈ జంట..కొద్దిరోజులుగా కరోనా లక్షణాలతో బాధపడుతోంది. వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్లగా..అక్కడ చేసిన పరీక్షల్లో కరోనా నిర్థారణయింది.

Also Read : అరుదైన తెలుపు రంగు జిరాఫీలను అన్యాయంగా చంపేశారుగా..!

ఇప్పటికే అమెరికాలో ఈ వైరస్ వల్ల 38 మంది చనిపోగా..టామ్ దంపతులకు కూడా ఈ మహమ్మారి వ్యాపించడంతో హాలీవుడ్ చిత్ర పరిశ్రమ షాక్ కు గురైంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో సింగర్ సీలైన్ డియాన్ తన షో ను వాయిదా వేసుకున్నట్లు ప్రకటించింది.

Next Story