అరుదైన తెలుపు రంగు జిరాఫీలను అన్యాయంగా చంపేశారుగా..!

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 March 2020 8:22 AM GMT
అరుదైన తెలుపు రంగు జిరాఫీలను అన్యాయంగా చంపేశారుగా..!

ప్ర పంచంలో అరుదైన జంతువుల లిస్టులో జిరాఫీలు కూడా ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా తెలుపు రంగు జిరాఫీలు కేవలం మూడంటే మూడే ఉన్నాయి. వాటిలో పంచంలో అరుదైన జంతువుల లిస్టులో జిరాఫీలు కూడా ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా తెలుపు రంగు జిరాఫీలు కేవలం మూడంటే మూడే ఉన్నాయి. వాటిలో రెండు జిరాఫీలను చంపేశారు. కెన్యాలో ఉన్నటువంటి మూడు తెలుపు రంగు జిరాఫీలలో రెండింటిని కొందరు వేటగాళ్లు చంపేశారు. తూర్పు కెన్యాలోని గరిస్సా ప్రాంతంలో ఆడ జిరాఫీని, దానికి పుట్టిన ఓ బిడ్డను చంపేశారు. ఇదే తెలుపు రంగు జిరాఫీకి పుట్టిన మగ జిరాఫీని మాత్రం ప్రాణాలతో వదిలేశారని 'ఇషక్బిని హీరోలా కమ్యూనిటీ కన్సర్వెన్సీ' సెంటర్ నిర్వాహకులు తెలిపారు.

తాము ఈ అరుదైన జీవులను కాపాడుకోడానికి ఎన్నో ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నామని ఆ సెంటర్ మేనేజర్ మొహమ్మద్ అహ్మద్ నూర్ తెలిపారు. కానీ ఇప్పుడు ఇలా చోటుచేసుకోవడం చాలా బాధగా ఉందని ఆయన తెలిపారు. 2017 నుండి తెలుపు రంగు జిరాఫీ ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని.. గత సంవత్సరం ఆగష్టు నెలలో అది రెండు జిరాఫీలకు జన్మనిచ్చిందని.. ఇప్పుడు దాన్ని కూడా పొట్టనబెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కెన్యా టూరిజం మీద ఆధారపడే ఎక్కువ ఆదాయం ఆర్జిస్తోంది.. ఇలాంటి చోట వేటగాళ్లు కూడా ఎక్కువగా ఉండడంతో జంతువులను కాపాడుకోవడం చాలా కష్టమైపోతోంది. ఇప్పటికే ప్రభుత్వం కఠిన శిక్షలు విధిస్తున్నా కూడా వేటగాళ్లు రెచ్చిపోతూ ఉన్నారు.

చాలా రోజుల కిందట నుండి ఆడ తెలుపు రంగు జిరాఫీ కనిపించడం మానేసింది. దీంతో ఏమయ్యాయి అని చూడగా.. దాదాపు అస్థిపంజరం స్థితిలో వాటి శరీరభాగాలు కనిపించాయి. ఆ రెండు జిరాఫీలు చనిపోయి కొన్ని నెలలు అయి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 'leucism' అనే కండీషన్ కారణంగా జిరాఫీలు తెలుపు రంగులో ఉంటాయని.. స్కిన్ సెల్స్ అన్నవి పిగ్మెంట్స్ రూపొందకుండా చేయడంతో జిరాఫీలు అలా తెల్లగా పుట్టాయని.. కొన్ని భాగాలు మినహా శరీరం మొత్తం తెలుపు రంగులోనే ఉంటుందని నేషనల్ జియోగ్రాఫిక్ కు చెందిన అధికారులు తెలిపారు.

Next Story