కొత్త సవాళ్లు విసురుతోన్న వైరస్..

By రాణి  Published on  1 April 2020 1:00 PM GMT
కొత్త సవాళ్లు విసురుతోన్న వైరస్..

కరోనా వైరస్ నెగిటివ్ వచ్చినా..ఆ వ్యక్తికి వైరస్ ఉన్నట్లేనని చెప్తున్నారు చైనా డాక్టర్లు. కరోనా వైరస్ కు విరుగుడు మందైతే ఇంకా కనిపెట్టలేదు కానీ..ప్రస్తుతం అందుబాటులో ఉన్న యాంటి బయోటిక్స్ తోనే బాధితులకు చికిత్స అందిస్తున్నారు. తాజాగా చైనా డాక్టర్లు కరోనా నుంచి కోలుకున్న వ్యక్తి నుంచి కళ్లె, మలం సేకరించి పరీక్షలు చేయగా విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. రక్తనమూనాలో వైరస్ పాజిటివ్ వచ్చినప్పటికీ వ్యక్తి కళ్లె, మలంలో మాత్రం వైరస్ ఆనవాళ్లు కనిపించాయని చైనా డాక్టర్లు వెల్లడించారు. ఈ విషయాన్ని అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ జర్నల్​లో ప్రచురితమైంది.దీంతో ఈ మహమ్మారి ఆటకట్టించేందుకు వ్యాక్సిన్ కనిపెట్టడానికి ప్రయత్నిస్తోన్న ప్రపంచ వైద్య నిపుణులకు, శాస్త్రవేత్తలకు ఇదో పెద్ద సవాల్ గా మారింది.

Also Read : ఆపరేషన్ తబ్లిగి జమాత్..రంగంలోకి అజిత్ ధోవల్

కరోనా బారిన పడిన వ్యక్తిని డిశ్చార్జ్ చేసేముందు అతని కఫం పై కూడా వైద్య పరీక్షలు చేస్తారు. అందులో వచ్చే ఫలితాలను బట్టి బాధితుడు మరిన్ని రోజులు క్వారంటైన్ లో ఉండాల్సి ఉంటుంది. ఆ తర్వాత అతనికి మరోసారి వైద్య పరీక్షలు చేసి అతడికి వైరస్ పూర్తిగా తగ్గిందా లేదా అని వైద్యులు నిర్థారిస్తారని చైనాలోని క్యాపిటల్ మెడికల్ యూనివర్శిటీ పరిశోధకులు వెల్లడించారు. వ్యక్తి నుంచి సేకరించిన కఫం ద్వారా వచ్చిన ఫలితాలు సరైనవా లేక శరీరంలోని ఇతర భాగాల నుంచి కూడా శాంపిల్స్ సేకరించాలా అన్న విషయంపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. అయితే వైరస్ టెస్టుల్లో కరోనా నెగిటివ్ గా తేలాక కూడా కొందరు బాధితుల కళ్లెల్లో 39 రోజులు, మలంలో 13 రోజుల పాటు వైరస్ ఆనవాళ్లున్నట్లు గుర్తించారు. అయితే ఇలా ఉండటం ద్వారా కూడా వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకుంతుందా అన్న దానిపై అధ్యయనం చేయాలని చెబుతున్నారు.

Also Read :ఎస్సై కాళ్లకు మొక్కిన ఎమ్మెల్యే..వీడియో వైరల్

Next Story