10వేలు దాటిన కరోనా మృతుల సంఖ్య.. భారత్‌లో ఐదుగురు..
By Newsmeter.Network
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ భయం పట్టుకుంది. అన్ని దేశాలు హై అలర్ట్ ప్రకటించాయి. చైనా దేశంలోని వుహాన్‌లో మొదలైన ఈ వైరస్ ఖండాంతరాలు దాటి చరిత్రలో ఎన్నడలూ లేని విధంగా ప్రపంచాన్ని భయబ్రాంతులకు గురిచేస్తుంది. ప్రాణాంతకమైన ఈ వైరస్‌ను నిరోధించడానికి ప్రపంచ దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ వైరస్ కారణంగా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 10వేలకు పైగా మంది మృతిచెందారు. ఇప్పటి వరకు 2,45,600 మందికి ఈ వైరస్ సోకింది. ఇదిలా ఉంటే ఈ వైరస్ భారిన పడి చికిత్స పొందుతున్న వారిలో 24గంటల్లోనే 1,100 మంది మృతిచెందారంటే ఈ వ్యాధి తీవ్ర ఏ స్థాయిలో ఉందో అర్థంచేసుకోవచ్చు.
ఇదిలా ఉంటే భారత్‌లో కరోనా మృతుల సంఖ్య ఐదుకు చేరింది. భారత్‌లో ఇప్పటికే కరోనా వైరస్ సోకిన వారు 175కి పైగానే ఉన్నాయి. కాగా నిన్నటి వరకు ఈ వైరస్ సోకి చికిత్స పొందుతూ నలుగురు మృతి చెందగా.. తాజాగా మరో వ్యక్తి మృతిచెందాడు. ఇటలికి చెందిన టూరిస్టు కరోనా వైరస్ సోకి మృతి చెందాడు. మరోవైపు కరోనాకు మూలకేంద్రమైన చైనాలో వరుసగా రెండు రోజులు ఎవరికి వైరస్ సోకలేదు. గురువారం కొత్తగా 39 కేసులు నమోదయిన వీరంతా విదేశాల నుంచి వచ్చినవారేనని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ తెలిపింది. దీంతో చైనాలో వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతున్నట్లు తెలుస్తోంది. కోవింద్ మరణాల్లో ఇటలీ మొదటి వరుసలో ఉన్నట్లు తెలుస్తుంది. ఐరోపా, ఇరాన్, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీలోనూ కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంది. కోవింద్ మరణాల్లో చైనా ఇటలీని అదిగమించిందని తెలుస్తుంది.
24గంటల్లో 500 మంది మృతి..
ఇటలీలో కరోనా వైరస్ అతలాకుతలం చేస్తుంది. ఈ వైరస్ భారిన పడి అక్కడి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. 24గంటల్లోనే 500 మంది ఈ వైరస్ భారిన పడి మృతిచెందారంటే అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటలీలో మృతుల సంఖ్య మొత్తం 3,405కి చేరింది. కొత్తగా మరో 3వేలకు పైగా కేసులు నిర్దారణ అయినట్లు తెలుస్తోంది. ఇలా ఇటలీలో మొత్తం 41,000 దాటింది. వీరిలో 4,400 మంది కోలుకున్నారని, 33,190 పరిస్థితి నిలకడగా ఉందని, 2,498 మంది పరిస్థితి విషమంగా ఉందని అక్కడి అధికారులు వెల్లడించారు. అగ్రరాజ్యం అమెరికాలో గురువారం ఒక్కరోజే 10 మంది మృతి చెందారు. కొత్తగా 533 కేసులు నమోదయ్యాయి. ఆ దేశంలో మొత్తం వైరస్ మరణాలు 218కి చేరుకోగా బాధితుల సంఖ్య 14,322గా ఉంది.