రేపు రాష్ట్రంలో బస్సులు బంద్: కేసీఆర్‌

By సుభాష్  Published on  21 March 2020 3:38 PM IST
రేపు రాష్ట్రంలో బస్సులు బంద్: కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్రంలో రేపు బస్సులు బంద్‌ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. అత్యవసర సేవల కోసం ప్రతీ డిపోలోఐదు బస్సులు సిద్ధంగా ఉంచామని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బస్సులకు రేపే రానివ్వబోమని కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఆదివారం కర్ఫ్యూ కారణంగా శనివారం ప్రగతి భవన్‌లో మీడియా సమవేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.

విదేశాల నుంచి వచ్చే వారితోనే సమస్య ఉందని, ఇప్పటి వరకూ 20 వేలకుపైగా విదేశాల నుంచి వచ్చారని, 11వేల మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. 5వేల 574 నిఘా బృందాలను ఏర్పాటు చేశామని, 52 చెక్‌ పోస్టులు, 78 జాయింట్‌ బృందాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ కరోనా వైరస్‌ కారణంగా ఐదుగురు సభ్యులతో నిపుణుల బృందాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇప్పటి వరకు తెలంగాణలో21 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని అన్నారు. ఇక విదేశాల నుంచి వచ్చిన వారు ప్రభుత్వం చెప్పినట్లుగానే వినాలని కోరారు. విదేశాల నుంచి వచ్చిన వారిపై నియంత్రణ ఉంటుందని, వారంతా స్వచ్చంధంగా పరీక్షలకు రావాలని సూచించారు. మీరు రిపోర్ట్‌ చేస్తే చాలు రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వమే వైద్యం అందిస్తుందన్నారు.

రేపు జనతా కర్ప్యూ ఉన్నందున 24 గంటల పాటు పాటిద్ధామని అన్నారు. ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి 6 గంటలకు ఈ బంద్‌ను పాటిద్దామని అన్నారు. ఈ వైరస్‌ కారణంగా ముందుగానే అప్రమత్తమయ్యాయని అన్నారు. తాజాగా హైదరాబాద్‌లో మరో కరోనా కేసు నమోదైందని, వైరస్‌ సోకిన మహిళ ఇంట్లో ఉన్న మరో ఇద్దరికి కరోనా అనుమానాలున్నాయని, ఇటీవల సదరు మహిళ సోదరుడు యూకే నుంచి వచ్చినట్లు తెలుస్తోందని అన్నారు.

Next Story