డేంజర్: కరోనా: చైనాకు చేరువలో భారత్
By సుభాష్ Published on 13 May 2020 5:10 AM GMTప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి ప్రపంచ దేశాలను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇక భారత్‌లో కూడా తీవ్రస్థాయిలో విజృంభిస్తోందని, ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. కాగా, కరోనా కేసుల్లో భారత్ చైనాకు దగ్గరకు చేరింది. ఈ వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో చైనా 11వ స్థానంలో ఉండగా, భారత్ 12వ స్థానంలో ఉంది. చైనాలో కేసుల సంఖ్య 82,900 దాటిపోగా, కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం.. మంగళవారం నాటికి భారత్‌లో కరోనా కేసుల సంఖఖ్య 70,756కు చేరింది. ముందు రోజుతో పోలిస్తే 3,604 కొత్తగా నమోదయ్యాయి. ఇక 1538 మంది కోలుకున్నారు. 87 మంది వరకూ మృతి చెందారు. ఇక నెల రోజుల క్రితం మరణాల రేటు చూసుకుంటే ఒకేలా ఉంది. రికవరీ రేటు మాత్రం నెల రోజుల్లో 9.05శాతం నుంచి 31.73కి చేరింది.
ఇక గత 24 గంటల్లో 24 రాష్ట్రాల్లో ఎలాంటి మరణాలు సంభవించలేదు. పది రాష్ట్రాల్ఓల కొత్తగా కేసులు కూడా నమోదు కాలేదు. మరణాలు కేవలం 9 రాష్ట్రాలకు మాత్రమే నమోదుకాగా, అందులో 64శాతం మహారాష్ట్ర, గుజరాత్‌లోనే చోటు చేసుకున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. మే 5వ తేదీ నుంచి కేసుల సంఖ్య మరింత పెరిగింది. 27,920 కేసులు వచ్చాయి. దేశంలో తొలి కేసు నమోదైనప్పటి నుంచి 28వేలకు చేరుకోవడానికి 83 రోజులు పట్టగా, గత 8 రోజుల్లోనే అందుకు సమానమైన కేసులు నమోదయ్యాయంటే భారత్‌లో కరోనా ఏ మేరకు ఉధృతం అవుతుందో అర్థమైపోతోంది.
ఇక చైనా మరణాల రేటు 5.59 కాగా, భారత్‌లో 3.25కి పరిమితం అయ్యింది. దీంతో మరణాల విషయంలో భారత్‌లో కొంత ఊరటనిచ్చిందనే చెప్పాలి.
ఇక దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తుండటంతో లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఒక విధంగా ఇతర దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యలో కానీ, మరణాల్లో కానీ తక్కువేనని చెప్పాలి. ప్రభుత్వం లాక్‌డౌన్ విధించి కరోనాను కట్టడిలో ఉంచింది. ప్రజలెవ్వరు బయటకు రాకుండా కట్టదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఇతర దేశాల్లో లాక్‌డౌన్ నిబంధనలు అంతగా లేకున్నా భారత్‌లో మాత్రం పటిష్టంగా అమలవుతోంది. అందుకు ప్రజలు కూడా సహకరిస్తున్నారు. అయితే భారత్‌లో కరోనా మొదట్లోనే అంతమైపోయేది. కానీ ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ ఉదాంతం నేపథ్యంలో భారత్‌లో కేసుల సంఖ్య అమాంతంగా పెరిగిపోయాయి. అప్పటి నుంచి అన్ని రాష్ట్రాల్లో పెరుగుతూ వస్తోంది.