కరోనా ఎఫెక్ట్‌.. నాలుగు నిమిషాల్లో ముగించేశారు..!

By Newsmeter.Network  Published on  28 March 2020 6:50 AM GMT
కరోనా ఎఫెక్ట్‌.. నాలుగు నిమిషాల్లో ముగించేశారు..!

పెండ్లి కార్యక్రమం అంటే ఓ పెద్ద తంతు.. రెండు రోజుల ముందునుంచే హడావుడి మొదలవుతుంది. ఇంటిల్లి పాది చుట్టాలు, బంధువులు.. ఊరంతా సందడిగా మారుతుంది.స్నేహితుల సందడితో, డీజేలు, నృత్యాలతో ఊరుఊరంతా ఉత్సాహ వాతావరణంతో నిండిపోతుంది. కానీ ప్రస్తుతం కరోనా వైరస్‌ విస్తరిస్తుండటంతో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించారు. తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి పెద్ద పెద్ద దేవాలయాల్లోకే భక్తులు రాకుండా ప్రభుత్వాలు మూసివేయించాయి. గ్రామాల్లో ఏ చిన్న కార్యక్రమానికి అనుమతి లేకుండా పోయింది. ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమ్మిగూడితే పోలీసులు లాఠీలకు పనిచెబుతున్నారు. ఈ నేపథ్యంలో భాజాభజంత్రిలతో అంగరంగ వైభవంగా జరగాల్సిన పెళ్లి కరోనా దెబ్బతో నాలుగు నిమిషాల్లోనే పూర్తయింది.

Also Red :లాక్‌ డౌన్‌ ఎఫెక్ట్‌.. కండోమ్‌లకు యమ గిరాకీ!

కర్ణాటకలోని కూడ్లిగి తాలూకా సిద్ధాపురంలో ఈ నాలుగు నిమిషాలు పెండ్లి జరిగింది. గ్రామానికి చెందిన రోహిణి, మధు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి పెండ్లికి పెద్దలు కూడా అంగీకరించడంతో ముహూర్తం నిర్ణయించారు. అయితే ఈ లోపు ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించడంతో పాటు ఎలాంటి కార్యక్రమాలకు అనుమతి లేకుండా చేసింది. ఏ చిన్న ఫంక్షన్‌ చేసిన.. ఐదుగురు కంటే ఎక్కువ మంది ఒకే చోటుకు చేరినా కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు. దీంతో వారికి ఏం చేయాలో పాలుపోలేదు. శుక్రవారం కూడ్లిగి సమీప మలియమ్మ దేవి ఆలయంలో పెండ్లి తంతును నాలుగు నిమిషాల్లో ముగించారు.

Also Read :కరోనా నివారణకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌.. వైద్యుల పర్యవేక్షణ తప్పనిసరి

ఈ పెండ్లి తంతులో కేవలం వధువు, వరుడు వైపు కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. కేవలం నాలుగు నిమిషాల్లో పెండ్లి తంతును ముగించుకొని వారి ఇండ్లకు వెళ్లిపోయారు. ఈ నాలుగు నిమిషాల పెండ్లి తంతు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నెటిజర్లు ముక్కన వేలేసుకుంటున్నారు. కరోనా వైరస్‌ ఎంత పనిచేసింది అంటూ కొందరు, కరోనా వైరస్సా.. మజాకానా..! అంటూ పలువురు కామెట్స్‌ పెడుతున్నారు.

Next Story