క్రిమినాశకాల పిచికారీతో కరోనా అంతంకాదు

By Newsmeter.Network  Published on  17 May 2020 12:04 PM IST
క్రిమినాశకాల పిచికారీతో కరోనా అంతంకాదు

కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను వణికిస్తూనే ఉంది. ఈ వైరస్‌ వ్యాప్తితో రోజురోజుకు పాజిటివ్‌ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఈ వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 46.80లక్షల మందికిపైగా ప్రజలు ఈ వైరస్‌ భారినపడ్డారు. వీరిలో 3లక్షల మందికిపైగా మృతిచెందారు. ఇదిలాఉంటే ఈ వైరస్‌వ్యాప్తిని అడ్డుకొనేందుకు ప్రపంచ దేశాలు పలు రకాల చర్యలకు పాల్పడుతు న్నాయి. చైనా, అమెరికా, భారత్‌ వంటి దేశాలతో పాటు పలు దేశాలు వైరస్‌ను నిర్మూలించేందుకు వీధుల్లో క్రిమిసంహారక మందును పిచికారి చేస్తున్నారు. ఈ క్రిమిసంహారక మందు పిచికారి చేయడం ద్వారా కరోనా వైరస్‌ను వ్యాప్తిచెందించే క్రిములు చనిపోతాయని ప్రభుత్వాలు భావిస్తున్నాయి.

Also Read :రూ. 12వేలలోనే పెండ్లి తంతుపూర్తి

కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించింది. ఈ మేరకు కీలక ప్రకటనలు చేసింది. కొన్ని దేశాలు భావిస్తున్నట్లు క్రిమిసంహారక మందులను వీధుల్లో చల్లడం వల్ల కరోనా వైరస్‌ తొలగించబదని, దాని వల్ల ప్రజల ఆరోగ్యానికి కూడా ప్రమాదం ఏర్పడుతుందని హెచ్చరించింది. వీధుల్లో, మార్కెట్‌లలో క్రిమి సంహారక మందును పిచికారి చేయలేమని తెలిపింది. బహిరంగ ప్రదేశాల్లోని దుమ్ము, చెత్త క్రిమినాశకాలను క్రియారహితం చేస్తాయని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. క్రిమినాశకాలు క్రిములను నిర్మూలించేలా ఉపరితలాలను సరైన రీతిలో శుభ్రపర్చలేమని పేర్కొంది. వ్యక్తులపై క్రిమినాశకాలను చల్లడం ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యమైన చర్య కాదని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది. ఇలాంటి చర్యలు శారీరకంగానే కాకుండా మానసికంగానూ హానికరమని పేర్కొంది.

Also Read :ఫలిస్తున్న భోపాల్‌లోని ఎయిమ్స్‌ వైద్యుల ప్రయోగం

Next Story