ఫలిస్తున్న భోపాల్‌లోని ఎయిమ్స్‌ వైద్యుల ప్రయోగం

By Newsmeter.Network  Published on  17 May 2020 4:47 AM GMT
ఫలిస్తున్న భోపాల్‌లోని ఎయిమ్స్‌ వైద్యుల ప్రయోగం

ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 46.83లక్షల మంది ఈ వైరస్‌ భారిన పడ్డారు. వీరిలో 3.10లక్షల మంది చనిపోయారు. కాగా ఈ వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ఆయా దేశాల ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు కఠిన చర్యలు తీసుకుంటున్నా వైరస్‌ వ్యాప్తిని అరికట్టలేక పోతున్నాయి. ఈ వైరస్‌ను కట్టడిచేసేందుకు ఆయా దేశాలు మందును కనిపెట్టేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో జంతువులపై ప్రయోగం విజయవంతం కావడంతో కరోనా వైరస్‌ సోకిన మనుషులపై ప్రయోగించేందుకు అమెరికా వంటి దేశాలు సిద్ధమవుతున్నాయి. భారత్‌లోనూ వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి.

Also Read :హ‌నుమంతుడి ముందా నీ గుప్పి గంతులు

తాజాగా భోపాల్‌లోని ఎయిమ్స్‌ నిర్వహించిన ప్రయోగాల్లో సానుకూల ఫలితాలు వచ్చినట్లు తెలుస్తోంది. కోవిడ్‌ -19 సోకిన రోగులకు మైకో బ్యాక్టీరియా డబ్ల్యూ అనే మందును ఇవ్వడం ద్వారా త్వరగా కోలుకుంటున్నట్లు గుర్తించామని అక్కడి వైద్యులు చెబుతున్నారు. పరిశోధనల్లో భాగంగా నలుగురు కరోనా రోగులకు ఈ మైకోబ్యాక్టీరియం డబ్ల్యూ అనే మందును ఇచ్చి పరీక్షించారు. వీరిలో ముగ్గురు కోలుకున్నారని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ శర్మాన్‌ సింగ్‌ చెప్పారు. ఫావిపిరావిర్‌ అనే ఔషధాన్ని కూడా కోవిడ్‌ -19 రోగులకు ప్రయోగాత్మకంగా ఇచ్చి చూస్తామన్నారు. ఇదిలాఉంటే ఆశ్చకరమైన విషయం ఏమిటంటే మైక్రో బ్యాక్టీరియం డబ్ల్యూను కుష్ఠు వ్యాధి సోకిన వారికి చికిత్స కోసం ఉపయోగించేవారు. ఇది కరోనా రోగులపై పనిచేస్తున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. దీనిని నిర్ధరించేందుకు భోపాల్‌లోని ఎయిమ్స్‌ సహా మూడు ఆస్పత్రుల్లో ప్రయోగాలు నిర్వహించేందుకు కేంద్ర ఔషద నియంత్రణ సంస్థ అనుమతిచ్చింది. త్వరలోనే పలువురిపై ప్రయోగించి మైకో బ్యాక్టీరియా డబ్ల్యూ ఎంతమేరకు కోవిడ్‌ -19 బాధితుల్లో పనిచేస్తుంది...? ఏమైనా ఇబ్బందులు ఉంటాయా అనే విషయాలను రాబట్టనున్నారు.

Also Read : రాసిన ప‌రీక్ష‌ల ఆధారంగానే ర్యాంకులు.. మిగిలిన ప‌రీక్ష‌లు ర‌ద్దు

Next Story