రూ. 12వేలలోనే పెండ్లి తంతుపూర్తి

By Newsmeter.Network  Published on  17 May 2020 5:30 AM GMT
రూ. 12వేలలోనే పెండ్లి తంతుపూర్తి

పెండ్లి తంతు పూర్తిచేయాలంటే లక్షల్లో ఖర్చు కావటం సర్వసాధారణం. అదీ.. కేవలం మధ్య తరగతి, పేద వర్గాల ఇండ్లలో మాత్రమే. అదే ధనికుల ఇండ్లలో అయితే కోట్లలో ఖర్చు చేస్తారు. ఎంత సింపుల్‌గా చేయాలన్నా కుటుంబ సభ్యులు, బంధువులు, తెలిసిన వారు.. ఇలా కొందరినైనా పిలిచి పెండ్లి తంతు పూర్తిచేయాల్సి ఉంటుంది. ఇందుకోసం కనీసం లక్షల్లో ఖర్చుచేయాల్సిందే. కానీ ప్రస్తుతం ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌తో హంగూఆర్భాటాలు లేకుండానే శుభకార్యాలన్ని జరిగిపోతున్నాయి. కరోనా దెబ్బతో ప్రపంచ వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతుంది. దీంతో ప్రజలందరూ ఇండ్లకే పరిమితం అవుతున్నారు. అనవసరంగా బయటకు వస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. శుభకార్యాలు చేయాలనుకున్నా 20 నుంచి 30 మంది కంటే ఎక్కువకాకుండా చూసుకోవాలని హెచ్చరిస్తున్నారు.

Also Read :ఫలిస్తున్న భోపాల్‌లోని ఎయిమ్స్‌ వైద్యుల ప్రయోగం

ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఓ కుటుంబం కేవలం రూ.12వేలలో పెండ్లి తంతును పూర్తిచేసింది. చందానగర్‌లో ఎస్‌మాక్స్‌ హెచ్‌ఆర్‌ ఉద్యోగి తొట్టెంపూడి నరేంద్రబాబు సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగిని వాసిరెడ్డి మౌనిక ను పెళ్లి చేసుకున్నాడు. వీరి మనస్సులు కలవడంతో పెళ్లి చేసుకుందామని మార్చి నెలలో నిశ్చయించుకున్నారు. లాక్‌డౌన్‌తో వివాహం వాయిదా పడింది. ఇప్పట్లో లాక్‌డౌన్‌ తొలగించే పరిస్థితులు కనిపించక పోవటంతో ఇరు కుటుంబాలకు చెందిన ముఖ్యమైన బంధువుల సమక్షంలో నరేంద్రబాబు, మౌనిక పెండ్లి చేసుకున్నారు. ఆ వివాహాన్ని కూడా చందానగర్‌ శ్రీటవర్స్‌ అపార్ట్‌ మెంట్‌లో చేసుకున్నారు. కేవలం వధువు, వరుడి తల్లిదండ్రులతో సహా పది మంది బంధువులు మాత్రమే పెళ్లికి హాజరయ్యారు. ఈ మొత్తం కార్యక్రమాన్ని నిర్వహించినందుకు కేవలం రూ. 12వేలు మాత్రమే ఖర్చయినట్లు వారు పేర్కొంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు కరోనా దెబ్బతో పెళ్లి ఖర్చుకూడా తగ్గిపోయిందంటూ చెెప్పుకోవటం గమనార్హం.

Also Read : హ‌నుమంతుడి ముందా నీ గుప్పి గంతులు

Next Story