దేశంలో 11కు చేరిన కరోనా మృతుల సంఖ్య

కరోనా వైరస్‌ వ్యాప్తి భారత్‌లో వేగంగా విస్తరిస్తుంది. రోజుకు పదుల సంఖ్యలో ఈ వైరస్‌ వ్యాపించి ఆస్పత్రుల బాటపడుతున్నారు. ఈ వైరస్‌ నివారణకు ప్రభుత్వం అన్ని విధాల కట్టుదిట్టమైన చర్యలను చేపడుతున్నా.. మహమ్మారిని పూర్తిస్థాయిలో అరికట్టలేక పోతుంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశం మొత్తం లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు వెల్లడించారు. ఎవరూ బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రతీ ఒక్కరూ ఇండ్లకే పరిమితం కావడం ద్వారా కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టవచ్చని, అందుకు ప్రజలందరూ సహకరించాలని ప్రధాని కోరారు.

Also Read : తెలంగాణలో మరో రెండు కరోనా కేసులు.. అది కూడా

ఇప్పటికే ఈ వైరస్‌ భారిన పడి ఆస్పత్రుల్లో చేరిన వారి సంఖ్య 519కి చేరింది. 10 మంది మృతి చెందారు. తాజా బుధవారం ఉదయం ఒకరు వైరస్‌ భారిన పడి మృతిచెందారు. దీంతో మృతుల సంఖ్య 11కు చేరింది. తమిళనాడుకు చెందిన 54ఏళ్ల వ్యక్తి కొద్ది రోజుల క్రితం జలుబు, దగ్గు, జ్వరంతో మధురైలోని రాజాజీ ఆస్పత్రిలో చేరాడు. వైద్య పరీక్షలు చేయగా.. కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. ప్రత్యేక వార్డుకు తరలించి చికిత్స అందించారు. అప్పటికే ఆయన అన్‌ కంట్రోల్డ్‌ డయాబెటిస్‌, సీఓపీడీ, హైపర్‌ టెన్షన్‌ వంటి సమస్యలతో బాధపడుతుండటంతో రోగ నిరోధక శక్తి పూర్తిగా క్షీణించింది. ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో బుధవారం ఉదయం కన్నుమూశారు.

Also Read :కరోనా ఎఫెక్ట్‌.. మా ఊళ్లోకి ఎవరూ రావొద్దు..

ఈ విషయాన్ని తమిళనాడు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్‌ ధ్రువీకరించారు. తమిళనాడు రాష్ట్రంలో కరోనా తొలి మరణం ఇదే. దీంతో ఆ రాష్ట్రం ప్రజలను మరింత అప్రమత్తం చేసింది. ఇప్పటి వరకు తమిళనాడులో వైరస్‌ భారిన పడి 18మంది చికిత్స పొందుతున్నారు. మరికొందరిని వైరస్‌ లక్షణాలు ఉండటంతో ఐసోలేషన్‌ కేంద్రాలకు తరలించారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *