భారత్‌లో 54లక్షలు దాటిన కరోనా కేసులు
By తోట వంశీ కుమార్ Published on 20 Sep 2020 5:17 AM GMTభారత్‌లో కరోనా మహమ్మారి విజృంబిస్తోంది. గత కొద్ది రోజులుగా రికార్డు సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24గంటల్లో 92,605 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 1,133 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర, ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 54,00,620కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో 43,03,044 మంది కోలుకోగా.. 10,10,824 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 86,752 మంది చనిపోయారు.
నిన్న ఒక్క రోజే ఇండియాలో 12 లక్షల మందికి కరోనా టెస్టులు నిర్వహించగా.. మొత్తం మీద ఇప్పటిదాకా 6.37 కోట్ల మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 79.28శాతంగా ఉండగా.. మరణాలు రేటు 1.61శాతంగా ఉంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదు అవుతున్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. 69లక్షల కేసులతో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతోంది. దేశంలో మహమ్మారి విజృంభణ ఇలాగే కొనసాగితే.. కొద్ది రోజుల్లోనే భారత్ మొదటి స్థానానికి చేరుతుందని పలువురు శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు.