కరోనా వైరస్ నుంచి రక్షణ పొందండిలా..కరోనా లక్షణాలు ఎలా తెలుస్తాయి..?

By సుభాష్  Published on  29 Jun 2020 12:58 PM IST
కరోనా వైరస్ నుంచి రక్షణ పొందండిలా..కరోనా లక్షణాలు ఎలా తెలుస్తాయి..?

ప్రపంచ వ్యాప్తంగా కరోనా తీవ్ర స్థాయిలో ఉంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. ఇక కరోనా నుంచి రక్షించుకునేందుకు ఇప్పటికే అనేక చోట్ల నుంచి సలహాలు వస్తూనే ఉన్నాయి. అయితే మనం కరోనా నుంచి రక్షించుకోవాడనికి వైద్య నిపుణులు పలు సూచనలు, సలహాలు ఇస్తున్నారు.

♦ కరోనా నుంచి రక్షణ పొందడానికి పరిశుభ్రత ఖచ్చితంగా పాటించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ప్రతిసారి చేతులను శానిటైజ్‌ చేసుకోవడం, లేదా సబ్బుతో శుభ్రం కడుక్కోవాలని వైద్యులు సూచిస్తోంది.

♦ మీ చేతులతో కళ్లుగానీ, ముక్కునుగానీ ముట్టుకోరాదు. చేతుల నుంచే వైరస్‌ శరీరంలోకి వెళ్లే ప్రమాదం ఉంది.

♦ దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు మోచేతిని గానీ, టిష్యూను గాని అడ్డం పెట్టుకోవాలి. అలాగే ఒకసారి వాడిన టిష్యూను వెంటనే పడేయాలి. దీంతో మరొకరికి వ్యాపించే అవకాశాలున్నాయి.

♦ ఒక వ్యక్తిని నుంచి మరో వ్యక్తి కనీసం రెండు మీటర్ల దూరం పాటించాలి.

♦ అవసరమైతేనే బయటకు వెళ్లాలి తప్ప..లేకుంటే వెళ్లకూడదు.

♦ ఎవరిని కలిసినా షేక్‌ హ్యాండ్‌ ఇవ్వకూడదు. తలవంచి, లేదా చేయి ఊపుతూ పలకరించాలి.

♦ జన సంచారం ఉన్న ప్రాంతంలోకి వెళ్లకపోవడం మంచిది.

♦ కరోనా వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది కాబట్టి వీలైనంతగా భౌతిక దూరం పాటించడం శ్రేయస్కరం.

మాస్కులు రక్షణ కలిగిస్తాయా..?

♦ సాధారణంగా సూపర్‌ మార్కెట్లో లభించే మాస్కులు వైరస్‌ నుంచి రక్షించలేవు. కానీ ఇన్‌ఫెక్షన్‌ సోకిన వాళ్ల నుంచి దగ్గు, జలుబు తుంపర్లు దగ్గరకు రానివ్వకుండా అడ్డుకోగవు.

♦ అలాగే చేతులకు గ్లౌవ్స్‌ ధరించడం కన్నా సబ్బు నీటితో కనుక్కోవడం వల్ల ఇన్ఫెక్షన్‌ సోకదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.

కరోనా లక్షణాలు ఎలా తెలుస్తాయి..?

♦ కరోనా వైరస్‌ సోకినట్లయితే పొడి దగ్గు, జ్వరంతో మొదలవుతుంది. గొంతునొప్పి, తలనొప్పి, డయోరియా, జలుబు, ఒళ్లు నొప్పులు తదితర లక్షణాలు కనిపిస్తాయి. అలాగే కొంత మందిలో రుచి, వాసన చూడకపోవడం లక్షణాలు కనిపిస్తాయని చెబుతోంది.

ఒక వేళ కరోనా బారిన పడినట్లయితే..

ఒక వేళ కరోనా బారిన పడినట్లయితే రెండు వారాల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలి. ఇక అదే ఇంట్లో మిగతా వాళ్లు కూడా చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ముందుగా వైరస్‌ సోకిన వారు ప్రత్యేక గదిలో ఉండాలి. ఇంట్లో ఎవరికీ రెండు మీటర్ల కంటే దగ్గర ఉండకూడదు. అలాగే పెంపుడు జంతువులను సైతం దగ్గరకు రానివ్వకూడదు. వైరస్‌సోకిన వ్యక్తికి ఉపయోగించేందుకు అవసరమైన వస్తువులను ప్రత్యేకంగా ఉంచాలి.

ఎప్పటికప్పుడు ఇల్లు శుభ్రం

♦ ఎప్పటికప్పుడు ఇల్లు శుభ్రం చేస్తూ ఉండాలి. శరీరంలో వచ్చే మార్పులను గమనిస్తూ వైద్యుడు సూచించినట్లుగా ఆహారం, మందులను వాడుతూ ఉండాలి. రోగ నిరోధక శక్తి పెంచే ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. యోగాపై ప్రత్యేక దృష్టి సారించాలి. కరోనా వచ్చిన వారు మెడిటేషన్‌తో పాటు మానసిక ధైర్యంగా ఉండేందుకు యోగా, మెడిటేషన్‌ లాంటివి చేస్తుండాలి. కరోనా సోకిన వారికి శరీరంలో ఉన్న శక్తి అంతా పీల్చేస్తుంటుంది. రోజురోజుకు మనిషి నిరసంగా తయారయ్యేలా చేస్తుంది. అందుకే బలమైన ఆహారం తీసుకోవాలి.

మరి కోలుకున్న వారు ఏం చెబుతున్నారు..

♦ కరోనా వైరస్‌ నుంచి కోలుకున్న వారు చెబుతున్న మాటేంటంటే.. వైరస్‌ నుంచి కోలుకున్న చాలా మంది ఇంట్లో ఉంటూ జాగ్రత్తలు పాటిస్తున్నారు. సామాజిక దూరం పాటిస్తున్నారు. వైరస్‌ సోకినా.. మానసికంగా ధైర్యంగా ఉండాలంటున్నారు. అలాగే రోగ నిరోధక శక్తి పెంచే ఆహారం తీసుకున్నామని, ప్రతి రోజు ఉదయాన్నే నిమ్మరసం, పసుపు, అల్లం, మిరియాలు వేసిన కాషాయాన్ని తాగేవాళ్లమని చెబుతున్నారు. మొత్తం మీద కరోనా మన నిర్లక్ష్యం వల్ల రోజురోజుకు పెరుగుతుందంటున్నారు

Next Story