కరోనా బోనస్..

By రాణి  Published on  17 March 2020 9:47 AM GMT
కరోనా బోనస్..

ప్రపంచ వ్యాప్తంగా 1,67,500 కరోనా వైరస్ బారిన పడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వైరకూ 7000కు పైగా ప్రజలు కరోనాతో మృతి చెందినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన సంగతి విధితమే. కాగా..ఈ వైరస్ కారణంగా లబ్ధి పొందుతున్నవారు లేకపోలేదు. అమెరికాలోని ఓ కంపెనీ ఉద్యోగులకు వైరస్ ను ఎదుర్కొనేందుకు వారి రెండు వారాల జీతాన్ని బోనస్ గా ఇచ్చేసింది.

ఇంతకీ అదేం కంపెనీనో తెలుసా..వర్క్ డే ఫైనాన్షియల్. కరోనా వైరస్ కారణంగా ఆర్థిక మాంద్యం దెబ్బతింది. ఫలితంగా నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి. ఇలా పెరిగిన ధరలు, ఇతర ఇబ్బందులను అధిగమించేందుకే ఆ కంపెనీ ఈ నిర్ణయం తీసుకుందట. ఈ మేరకు ఒక ప్రకటనను కూడా విడుదల చేసింది.

Also Read : షిరిడీపై కరోనా ఎఫెక్ట్

''కరోనా వైరస్ వ్యాపి నేపథ్యంలో చాలా సంస్థలను మూసివేశారు. ఇలాంటి పరిస్థితుల్లో మా ఉద్యోగులకు ఆర్థికంగా సపోర్ట్ కావాలి. వారిని బాగా చూసుకుంటే..మా వినియోగదారులను కూడా బాగా చూసుకున్నట్లే. అనుకోకుండా వచ్చిన ఈ విపత్తు సమయంలో..మా ఉద్యోగులకు అండగా నిలవడం చాలా కీలకం'' అని పేర్కొంది.

Also Read : 24 గంటలు.. 14,000 కేసులు.. 7,100 మరణాలు

అయితే ఉద్యోగులకు బోనస్ ఇచ్చేందుకు ప్రత్యేకంగా ఒక అదనపు నిధిని కూడా ఏర్పాటు చేసిందీకంపెనీ. అలాగే వేతనంతో కూడిన అనారోగ్య సెలవు విధానాన్ని కూడా సవరించి కరోనా వైరస్ సెలవు కింద ఇవ్వనుంది. కాగా..2005లో నెలకొల్పిన వర్క్ డే సంస్థలో ఫైనాన్షియల్ మేనేజ్ మెంట్ సేవలు, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్ మెంట్ సేవలు, ప్లానింగ్ అండ్ అనలటిక్స్ అప్లికేషన్స్ వ్యాపారాలను నిర్వహిస్తోంది. అమెరికాలో దాదాపు 4500 మందికి పైగా కరోనా వైరస్ సోకగా..వారిలో 88 మంది మరణించారు.

Next Story