తూర్పుగోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కంటైనర్..
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 4 Nov 2019 10:36 AM ISTతూర్పుగోదావరి: ఆలమూరు మండలం జొన్నాడ వద్ద ఓ కంటైనర్ బీభత్సం సృష్టించింది. సోమవారం తెల్లవారుజామున గౌతమి వంతెన సమీపంలోని తూర్పు డెల్టా ప్రధాన కాల్వలోకి కంటైనర్ దూసుకెళ్లింది. చెన్నై నుంచి ఒడిశాకు హోండా కార్ల లోడ్‌తో వెళ్తుండగా కంటైనర్ అదుపు తప్పడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కంటైనర్ క్యాబిన్ పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో ఎంత మంది ఉన్నారో తెలియరావడం లేదు. క్యాబిన్‌లో డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కాగా రావులపాలెం నుండి క్రేన్లను తీసుకొచ్చినా ప్రయోజనం లేకపోవడంతో ఓఎన్జిసి అధికారులతో చర్చలు జరిపి భారీ క్రేన్లను రప్పించేందుకు సిఐ మంగాదేవి ప్రయత్నాలు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది.
Next Story