తుపాకీతో కాల్చుకుని కానిస్టేబుల్‌ ఆత్మహత్య

By సుభాష్  Published on  8 March 2020 8:54 AM GMT
తుపాకీతో కాల్చుకుని కానిస్టేబుల్‌ ఆత్మహత్య

హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. జవహార్‌నగర్‌లో సీఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బబన్‌ విఠల్‌ మన్వర్‌ (38) కానిస్టేబుల్‌ హకీంపేటలోని సీఆర్పీఎఫ్‌ క్యాంపస్‌లో గార్డ్‌ డ్యూటీ చేస్తున్నాడు. విఠల్‌ రాత్రి విధుల్లో ఉండగా, తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇటీవల విఠల్‌ సెలవుపై వెళ్లి తిరిగి వచ్చిడ్యూటీలో చేరినట్లు తెలుస్తోంది.

Next Story
Share it