లాక్‌డౌన్: ఉరి వేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య
By సుభాష్ Published on 23 April 2020 8:48 PM IST
తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే అన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఇక తొర్రూరులో లాక్‌డౌన్ విధుల్లో ఉన్నఓ కానిస్టేబుల్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉపేందర్ (45) అనే కానిస్టేబుల్ తొర్రూరు ఆర్టీసీ బస్టాండు కంట్రోల్ రూమ్‌లో విధులు నిర్వహిస్తున్నారు.
కాగా, కంట్రోల్ రూమ్ సమీపంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు పోలీసులు.
Next Story