కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం ఆయన పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఐదుసార్లు లోక్‌సభ సభ్యుడిగా.. రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గం నుండి పోటిచేసి మంద జగన్నాథంను ఓడించి 16వ లోకసభకు ఎన్నికయ్యారు.

కొద్దిరోజుల క్రితం కరోనా సోకడంతో ఆయ‌న్ను నిమ్స్‌కు త‌ర‌లించారు. చికిత్స అనంతరం నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు కరోనా నెగిటివ్‌గా వచ్చింది. కాగా.. కరోనా మహమ్మారి కారణంగా ఆయన రోగ నిరోధక వ్యవస్థ బాగా దెబ్బతింది. దీంతో ఈ రోజు ఉదయం 10 గంటలకు నిమ్స్ లో క్రానికల్ వ్యాధితో నంది ఎల్లయ్య మరణించినట్లు కుటుంబ సబ్యులు తెలిపారు. నంది ఎల్లయ్య మృతి పట్ల కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సంతాపం తెలిపారు. వారి కుటుంబ స‌భ్యుల‌కు సానుభూతి ప్ర‌క‌టించారు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.