కాంగ్రెస్ నేతల ముందు భారీగా మొహరించిన పోలీసులు.. హౌస్ అరెస్ట్‌లు
By సుభాష్ Published on 2 Jun 2020 3:21 AM GMTజదీక్ష తలపెట్టిన తెలంగాన కాంగ్రెస్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడే అరెస్టులు చేస్తున్నారు. కాగా, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల వద్ద తెలంగాణ కాంగ్రెస్ నేతలు జలదీక్షలు చేయాలని నిర్ణయించారు. దీంతో దీక్షలను అడ్డుకునేందుకు పోలీసులు వారిని గృహ నిర్భంధం చేస్తున్నారు. తాజాగా మంగళవారం పార్లమెంట్ సభ్యుడు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కాగా, ఎస్‌ఎల్బీసీని చూసేందుకు అనుమతి ఇచ్చి గృహ నిర్బంధం చేయడం ఏమిటని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేస్తానని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ నేతలను ముందస్తుగా అరెస్టు చేస్తున్నారు పోలీసులు. నాయకుల ఇళ్ల ముందు పెద్ద ఎత్తున పోలీసులు మొహరించారు. సంపత్ కుమార్‌ను సైతం హౌస్ అరెస్టు చేశారు. అలాగే మాజీ ఎమ్మెల్యే వంశీచందర్‌రెడ్డిని కూడా హౌస్ అరెస్టు చేశారు. లక్ష్మీ పంప్ హౌస్ వద్ద కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి జలదీక్షను తలపెట్టారు.
కాగా, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఇంటి ముందు కూడా పోలీసులు భారీగా చేరుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణలో ఒక దుర్మర్గమైన పాలన కొనసాగుతోందని, 6వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు కాంగ్రెస్ పార్టీ నేతలను గృహ నిర్బంధం చేయడం అప్రజాస్వామికం, ఇంత దారుణమైన చర్య ఏది లేదని దుయ్యబట్టారు. మాట్లాడితేనే అరెస్ట్ చేయడం పాశవిక పాలనకు పరాకాష్ట అని అన్నారు. ఇందుకోసమేనా తెలంగాణ తెచ్చుకుంది.. ఆవిర్భావ దినోత్సవం నాడే హక్కులు కాలరాస్తే ఎలా అంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో ఒక నియంత, అసమర్థత పాలన సాగుతుందని, కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్ట్‌లనుతీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ నాయకుల ఇళ్ల ముందు నుంచి పోలీసులు వెళ్లిపోవాలని అన్నారు. శాంతి యుతంగా మేము చేసుకునే కార్యక్రమాలకు అడ్డు రాకూడదని అన్నారు.