ఉపగ్రహ చిత్రాల్లో దాగిన ఉపద్రవం..?!!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 26 Oct 2019 11:43 AM ISTహైదరాబాద్ ప్రజలను ఉపగ్రహ ఉహాచిత్రాలు ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ప్రాణాధారమైన జలమే భవిష్యత్తులో ప్రజకు గండంగా మారనుంది. రానున్న రోజుల్లో హైదరాబాద్ ప్రజలను వరదలు ఎక్కువయ్యే..తాగడానికి గుక్కెడు నీరు దొరకకనో ఎదో ఒక రూపంలో నీళ్లు మృత్యువు రూపంలో కబళించనున్నాయి. హైదరాబాద్‌లో భారీ ఎత్తున నిర్మాణాలు చేపడుతున్నారు. వాటర్ బాడీ ఇన్‌ఫ్లో ఛానల్‌ను నాశనం చేయడం వల్ల హైదరాబాద్‌లోని పప్పులుగూడలోని నవనామి రెసిడెన్సీ నివాసితులకు వర్షపు నీళ్లు శాపంగా మారాయి
వరదల ప్రభావం ఎలా ఉంటుందో నాలుగు ఉపగ్రహ చిత్రాలు వెల్లడిస్తున్నాయి. ఈ చిత్రాలను హైదరాబాద్‌లోని సేవ్ అవర్ అర్బన్ లేక్స్ (సోల్) కన్వీనర్ డాక్టర్ లుబ్నా సర్వత్ విడుదల చేశారు. 2015 నుంచి 2019 వరకు ఆక్రమణల కారణంగా భోలఖ్ పూర్ వాటర్‌బాడీ ఇన్‌ఫ్లో ఛానల్స్ అంచెలంచెలుగా నాశనం చేయడాన్ని ఉపగ్రహ చిత్రాలు సూచిస్తున్నాయి.
నేటికీ నవనామి నివాసాల మధ్య నుంచి వర్షపు నీరు ప్రవహిస్తోంది. నిర్మాణాలకు రహదారి అడ్డంగా ఉందని ఏకంగా..ఆ రోడ్డునే ధ్వంసం చేశారు కొంత మంది బిల్డర్లు. దీంతో వరద నీరు వెళ్లడానికి మార్గం లేకుండా పోయింది.
రహదారి ధ్వంసం అయినప్పటి నుంచి వాటర్ బాడీకి దక్షిణం వైపున ఉన్న ఔట్ ఫ్లో ఛానల్ కూడా కొంత మేర మూసేశారు. దీంతో ఏకంగా నవనామి రెసిడెన్స్ బేస్మెట్ల నుంచే వరద నీరు ప్రవహిస్తుంది సర్వత్ తెలిపారు.
సర్వే నెంబర్ 288లోని వాటర్ బాడీ ఇన్ ప్లో ఛానెల్స్ ను పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు. వరద ప్రవాహానికి ఆటంకాలు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులతో సామాజిక వేత్తలు, స్థానికులు గత సంవత్సరం నుంచి పోరాడుతున్నారు.
గాంధీన్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ నవీన్ నేతృత్వంలోని బృందం నవనామి రెసిడెన్షియల్ నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రెవెన్యూ అధికారి నవీన్ న్యూస్ మీటర్ తో మాట్లాడుతూ ..బిల్డర్లు నిబంధనలు ఉల్లంఘిస్తూ తమ ఇష్టారాజ్వరంగా నిర్మాణాలు చేపట్టారన్నారు. వరద నీటిని డ్రైనేజీల్లోకి మళ్లించారని వెల్లడించారు. నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని తెలిపారు.
హుడా మాస్టర్ ప్లాన్లో ఈ వాటర్ బాడీని తొలిగించారు. భారతదేశ టోపోషీట్ సర్వే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా ఈ జలాశయాన్ని (హెచ్ ఎం డి ఏ) గుర్తించలేదు. ఇదిలా ఉండగా గూగుల్ మ్యాప్ ఒక వాటర్ బాడీ ఉందని ..అది బోలక్ పూర్ ఛానెల్ కు సమీపంలో గుర్తించింది.
నవనామి సైట్లో ఒక జలాశయం ఆక్రమణకు గురైందని తమ విచారణలో తేలిందని నవీన్ అన్నారు. పూర్తి స్థాయి నివేదిక అందాక ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు. అక్రమ నిర్మాణాలను తొలగించి ఈ నీటి గుంతను పునరుద్ధరిస్తామన్నారు.
2008 ఉపగ్రహ చిత్రాల ప్రకారం బోలక్ పూర్ జలాశయం ఇన్ ఫ్లో ఛానల్ సర్వే నంబర్ 288 లో యథాతథంగా ఉంది. 2017 చిత్రాలను పరిశీలిస్తే ఇన్ ఫ్లో ఛానెల్ ఉనికి ప్రశ్నార్థకంగా కనిపించింది. అయితే 2019 నుండి తాజా ఉపగ్రహ చాత్రాలు చూస్తే ఛానెల్ తోపాటు, వాటర్ బాడీ పూర్తిగా ఆక్రమణకు గురైనట్లు తెలుస్తోంది