ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నవంబర్‌ 1న నిర్వహించాలని సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు.

మంగళవారం సీఎం జగన్‌ జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ సీఎస్‌ మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నవంబర్‌ 1 జరపాలని, ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలుగు తల్లి విగ్రహాన్ని నవంబర్‌ 1న ఆవిష్కరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీ హస్తకళల అభివృద్ధి సంస్థ రూపొందించిన తెలుగు తల్లి విగ్రహాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లారు.

అలాగే ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన మంత్రి వర్గం సమావేశం అయ్యింది. ఈ సమావేశంలో అమ్మ ఒడి పథకంపై విధివిధానాలను కేబినెట్‌ ఖరారు చేయనుంది. అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషకాహార పథకానికి కేబినెట్‌ ఆమోదం తెలపనుంది. హజ్‌, జెరూసలెం యాత్రుకుల ఆర్థిక సాయం పెంపుపై చర్చించనున్నారు. గ్రామీణ వ్యవసాయ పరీక్షా కేంద్రాల ఏర్పాటుపై కేబినెట్‌ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story