బ్రేకింగ్‌: తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం: జూన్‌ 19 నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌

By సుభాష్  Published on  15 Jun 2020 4:51 PM IST
బ్రేకింగ్‌: తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం: జూన్‌ 19 నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌

భారత్‌లో కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో దేశంలోసంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు కాబోతోందని సోషల్‌ మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో కేంద్రం స్పందించింది. మళ్లీ సంపూర్ణ లాక్‌ డౌన్‌ విధించే ఉద్దేశం లేదని తేల్చి చెప్పింది. ఇప్పటికే దేశంలో మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడులతో పాటు ఇతర రాష్ట్రాల్లో కరోనా తీవ్రస్థాయిలో ఉంది. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. చెన్నై చుట్టుపక్కల భారీ సంఖ్యలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతుండటంతో చెన్నైతో పాటు చెంగల్‌పట్టు, తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాల్లో సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళని స్వామి ప్రకటించారు.

ఈనెల 19 నుంచి 30వ తేదీ వరకూ లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. సోమవారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను సోమవారం సాయంత్రం విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. అయితే ఈ లాక్‌డౌన్‌లో మెడికల్‌, కూరగాయలు, పండ్ల మార్కెట్లు, పెట్రోల్‌ బంక్‌లు ఉదయం 6 గంటల నుంచి 2 గంటల వరకు మాత్రమే తెరుచుకోనున్నాయి. ఇక రెస్టారెంట్లు, హోటళ్లు కేవలం పార్శిళ్లకు మాత్రమే అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక కంటైన్‌మెంట్‌ జోన్లలో మాత్రం ఎలాంటి షాపులు తెరిచేందుకు అనమతి లేదు. ప్రజలు తమ ఇళ్ల నుంచి రెండు కిలోమీటర్ల పరిధిలో మాత్రమే వాహనాలపై ప్రయాణించాల్సి ఉంది. అత్యవసర సర్వీసులు, ట్రావెల్స్‌, వైద్య పరమైన అత్యసవర సేవలను అనుమతిస్తారు.

అలాగే ఆటోలు, టాక్సీలకు, వైద్య పరమైన అత్యవసర సమయాల్లో మాత్రమే అనుమతి ఉంది. బ్యాంకులు ఈనెల 29, 30 తేదీల్లో 33 శాతం సిబ్బందితో మాత్రమే పని చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలతో తెలిపింది.అయితే

కాగా, నిన్న ఒక్క రోజే 1974 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 44,6661 కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకూ 435 మంది మృతి చెందారు. ఇక కోలుకున్న వారి సంఖ్య 24,547 ఉంది.



Next Story