బెంగళూరు: ఇన్ఫోసిస్‌లో మళ్లీ కొత్త వివాదం రాజుకునేలా ఉంది. చాప కింద నీరులా ఇన్ఫోసిస్‌లో ఏదో జరుగుతున్నట్లు అనిపిస్తోంది.ఇన్ఫీ సీఈవో సలీల్ ఫరేఖ్‌, సీఎఫ్‌వో నిలంజన్ రాయ్‌ అనైతిక పద్దతులు అవలంభిస్తున్నట్లు బోర్డ్‌కు గుర్తు తెలియని వ్యక్తులు ఫిర్యాదు చేశారు.

దీనికి సంబంధించి ఈ మెయిల్, వాయిస్ రూపంలో ఆధారాలు లేఖలో పేర్కొన్నట్లు పీటీఐ వెల్లడించింది. బోర్డు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఒకరు అమెరికాలోని ‘విజిల్ బ్లోయర్ ప్రొటెక్షణ్ ప్రోగ్రాం’ కార్యాలయానికి అక్టోబర్‌ 3న లేఖ రాశారు. తప్పుడు లెక్కలు చూపారని లేఖలో రాశారు. జూన్‌ – సెప్టెంబర్‌లో లాభాలు ఎక్కువ చేసి చూపడం కోసం ..వీసా వంటి ఖర్చులు ఖాతాల్లో చూపొద్దని ఆదేశించినట్లు చెప్పారు. వాయిస్ రికార్డ్ ఆధారాలు కూడా ఉన్నాయని లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఓ కాంట్రాక్ట్ విషయం గురించి లేఖలో ప్రముఖంగా పేర్కొన్నట్లు లేఖలో రాసినట్లు తెలుస్తోంది. ఇది నిబంధనలకు పూర్తిగా విరుద్ధమన్నారు. ఫరేఖ్ చేతిలో కీలుబొమ్మగా మారిన రాయ్ సైతం ఆయనకు సహకరిస్తున్నారని ఫిర్యాదు దారులు లేఖలో రాసినట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం సమస్యను పరిస్కరిస్తామని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.