డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్, ఆయన భార్య సవితా అంబేద్కర్ ల చిత్రాలు దక్షిణ అమెరికాలోని కొలంబియాలో ఓ బస్సు మీద ఏర్పాటు చేశారని కొన్ని ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి. అంబేద్కర్ దంపతులకు దక్కిన అరుదైన గౌరవం ఇదని పలువురు పోస్టులు పెడుతూ ఉన్నారు.

“The photo of Babasaheb on a city bus running on the streets of Colombia…This is a real honor. America still considers Babasaheb an idol because America’s economy is based on the same book that Babasaheb wrote as a thesis for his doctor’s degree during the British period https://t.co/nhwpKJls7V” అంటూ పోస్టులు పెడుతూ ఉన్నారు. కొలంబియా నగరంలోని వీధుల్లో ఓ సిటీ బస్సు మీద అంబేద్కర్ దంపతుల చిత్రాలను ఏర్పాటు చేశారని.. ఇది అరుదైన గౌరవం అని ఆ పోస్టులో చెబుతూ ఉన్నారు. అమెరికన్లు కూడా బాబాసాహెబ్ ను తమ ఐడల్ గా భావిస్తూ ఉంటారని అందులో చెప్పుకొచ్చారు.


నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న పోస్టులో ‘ఎటువంటి నిజం లేదు’.

ఈ ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. అదే ఫోటో Wikimedia Commons అనే వెబ్ సైట్ లో కనిపించింది. కానీ అందులో బాబాసాహెబ్ అంబేద్కర్, ఆయన భార్యకు సంబంధించిన చిత్రాలు లేవు. ఈ బస్సు కూడా కొలంబియాకు చెందినది కాదు. ఇంగ్లాండ్ లోని బాత్ లో సిటీ సైట్ సీయింగ్ ఆపరేటర్ కు చెందినది. “City Sightseeing” అనే పేరు అంబేద్కర్ ఫోటో ఉన్న చోటు ఉంది.

Alamy కూడా ఈ బస్సుకు సంబంధించిన ఫోటోలను చూడొచ్చు. కానీ అందులో అంబేద్కర్, ఆయన భార్యకు సంబంధించిన ఫోటోలు లేవు.

Gezimanya అనే టూరిస్ట్ వెబ్ సైట్ లో కూడా ఒరిజినల్ ఫోటోను చూడొచ్చు.

వైరల్ అవుతున్న ఫోటో మార్ఫింగ్ చేసినదని స్పష్టంగా అర్థమవుతోంది. కొలంబియాలో అంబేద్కర్, ఆయన భార్య చిత్రాలు ఉన్న బస్సు వీధుల్లో తిరుగుతోంది అన్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.
antalya escort
anadolu yakası escort maltepe escort escort bayan kartal escort ataşehir escort pendik escort bostancı escort kurtköy escort maltepe escort kartal escort