జన్యు వ్యాధికి కాఫీ మందు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 Oct 2019 11:27 AM IST
జన్యు వ్యాధికి కాఫీ మందు..!

హైదరాబాద్: కాఫీని పరిమితికి మించి తాగకూడదు అంటారు. పరిమితికి మించి తాగితే ఆరోగ్య సమస్యలు వస్తాయంటారు. అయితే..తరుచుగా కాఫీ తాగడం వలన ఓ వ్యక్తిలో జన్యపరమైన వ్యాధి నయమైంది. హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ పరిశోధకులు కాఫీ థెరపీ ద్వారా వ్యాధిని నయం చేసినట్లు ప్రకటించారు. బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి ఐదేళ్లుగా జన్యుసంబంధిత వ్యాధితో బాధ పడుతున్నాడు.తన ప్రమేయం లేకుండానే రోజులో 10 నుంచి 15 సార్లు అవయవాలతోపాటు అతని ముఖమూ కదిలేది. నివారణకు మందులు వాడినా ఉపయోగం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో సీడీఎఫ్ డీలో పని చేసే ఉద్యోగి అశ్విన్ దలాల్‌ తన మిత్రుడి వ్యాధి గురించి తెలిసింది. బెంగళూరు కి చెందిన వ్యాధి గ్రస్తుడికి పరీక్షలు నిర్వహించారు . ఈ పరీక్షల్లో అతనికి అడినిలైటెడ్ సైక్లేస్ వ్యాధి ఉన్నట్లు తేలింది. ఫ్రాన్స్‌లో ఒకతనికి ఇటువంటి వ్యాధే ఉండేదని..అతినికి కాఫీ తాగించడం ద్వారా ప్రాబ్లమ్ పోయిందని అశ్విన్ విన్నాడు. దీంతో బెంగళూరుకు చెందిన జన్యువ్యాధి గ్రస్తుడిపై కాఫీ థెనఫీ ప్రయోగించారు. రమేష్ 3 నెలలుపాటు రోజూ 3 సార్లు కాఫీ తాగడంతో అతని వ్యాధి పోయింది. జన్యుసంబంధిత వ్యాధులకు చికిత్స ఉండదని..నివారణ ఒక్కటే మార్గమని అశ్విన్‌ చెప్పారు.

Next Story