కరోనా గాలి ద్వారా కూడా వ్యాపించగలదు : సీఎన్‌బీసీ సంచ‌ల‌న క‌థ‌నం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 March 2020 6:08 AM GMT
కరోనా గాలి ద్వారా కూడా వ్యాపించగలదు : సీఎన్‌బీసీ సంచ‌ల‌న క‌థ‌నం

కరోనా వైరస్.. ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. భారత్ లో కూడా ప్రస్తుతం అలాంటి పరిస్థితే నెలకొంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం కరోనా వైరస్ గాలిలో కూడా బ్రతకగలదని చెబుతున్నారు. తాజాగా చేసిన రీసర్చ్ ప్రకారం కరోనా వైరస్ గాలిలో ఎనిమిది గంటలకు పైగా బ్రతగలదని సిఎన్బిసి కథనాన్ని వెల్లడించింది. కొన్ని పరిస్థితులకు కరోనా వైరస్ ట్యూన్ అవ్వగలదని తాజా రీసర్చ్ లో తెలుస్తోంది.

వైరస్ అన్నది నీటి తుంపరలు రూపంలో బతకగలదని.. లేదా ద్రవ రూపంలో కూడా ఉండగలదని.. ముఖ్యంగా తుమ్మడం, దగ్గడం ద్వారా వ్యాప్తి చెందే అవకాశాలు అత్యధికంగా ఉన్నాయని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎమర్జింగ్ డిసీస్ అండ్ జూనొసిస్ యూనిట్ హెడ్ అయిన డాక్టర్ మారియా వాన్ కెర్ఖోవ్ తెలిపింది. ముఖ్యంగా హెల్త్ కేర్ సిబ్బంది చాలా అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించింది. మెడికల్ కేర్ ఫెసిలిటీలో పనిచేసే సమయంలో.. కరోనా వైరస్ అన్నది గాలిలోనే ఎక్కువ సమయం ఉండే అవకాశం ఉందని.. అలాంటప్పుడు ఇతరులు కూడా ఆ గాలిని పీల్చడం ద్వారా ఆ వైరస్ అన్నది వ్యాప్తి చెందే అవకాశం ఉందని అన్నారు.

ఈ వైరస్ ఒక మనిషి నుండి మరొక మనిషికి వ్యాప్తి చెందే అవకాశం ఉందని.. ఎప్పుడైతే వైరస్ సోకిన వ్యక్తి తుమ్మడం లేదా దగ్గడం చేస్తాడో.. అలాంటి సమయంలో గాలిలో ఉన్న సూక్ష్మ క్రిముల కారణంగా వైరస్ అన్నది ఇతరుల లోకి వ్యాప్తి చెందుతుంది. వేడి, గాలిలో తేమ లాంటి వాటిని ఆసరాగా చేసుకుని కరోనా వైరస్ ఎక్కువ సేపు గాలిలో ఉంటుందని ఆమె తెలిపారు.

హెల్త్ అఫీషియల్స్ కు ఈ పరిస్థితిపై సరైన అవగాహన ఉండాలని.. ఇప్పటికే కోవిద్-19 వైరస్ పై పలు దేశాలకు సరైన సమాచారం అందించామని అన్నారు. శాస్త్రవేత్తలు ముఖ్యంగా గాలిలో తేమ, ఉష్ణోగ్రత, అల్ట్రా వయొలెట్ లైటింగ్ వంటివి వైరస్ పై ఎలాంటి ప్రభావం చూపుతాయా అన్నదానిపై అంచనా వేస్తున్నారు. అలాగే వివిధ రకాల పదార్థాలు, లోహాలపై ఎంతసేపు బ్రతకగలవో కూడా పరిశీలిస్తూ ఉన్నారు.

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గైడ్ లైన్స్ ను హెల్త్ అఫీషియల్స్ ఎప్పటికప్పుడు పాటిస్తూ ఉన్నారు. మెడికల్ స్టాఫ్ ముఖ్యంగా N95 మాస్కులను ఉపయోగించాలని సూచించింది. ఎందుకంటే ఈ మాస్క్ 95శాతం ద్రవాలను, గాలిలో ఉన్న సూక్ష్మక్రిములను అడ్డుకోగలదని అంటున్నారు. హెల్త్ కేర్ ఫెసిలిటీ సెంటర్స్ లో ప్రతి ఒక్కరూ వీటినే ఉపయోగించాలని ఆమె చెప్పుకొచ్చారు.

యు.ఎస్.సెంటర్స్ ఫార్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డైరెక్టర్ రాబర్ట్ రెడ్ ఫీల్డ్ గత నెలలోనే తమ ఏజెన్సీ కోవిద్-19 ఎన్ని గంటల పాటూ.. ఏయే ప్రాంతాల్లో బ్రతకగలదో తాము పరిశీలిస్తున్నామని అన్నారు. రాగి, స్టీల్ పై కేవలం రెండంటే రెండు గంటలు మాత్రమే కోవిద్-19 బతకగలదని ఆయన అన్నారు. అలాగే కార్డ్ బోర్డ్, ప్లాస్టిక్ లాంటి వస్తువులపై ఎంత సమయం బతకగలదో అంచనా వేస్తున్నామని అన్నారు. డైమండ్ ప్రిన్స్ క్రూజ్ షిప్ లో వైరస్ అవుట్ బ్రేక్ అన్నది గాలి ద్వారానే జరిగిందని అన్నారు.

ప్రస్తుతానికి ఎటువంటి మందులు లేవని.. ప్రతి దేశానికి తాము చెప్పగలిగింది ఒకటేనని టెస్ట్, టెస్ట్, టెస్ట్, టెస్ట్ అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధానం గెబ్రెయేసుస్ తెలిపారు. అనుమానితులను గుర్తించి వారికి టెస్టులు చేయాలని.. పాజిటివ్ అని వస్తే వారిని ఐసొలేషన్ లో ఉంచి.. ఎప్పటికప్పుడు వారి ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని అన్నారు. అలాగే పాజిటివ్ వచ్చిన వారు ఎవరితో కాంటాక్ట్ లో ఉంటారో.. వారిపై కూడా నిఘా ఉంచాలని అన్నారు.

Next Story