అమరావతి: ఏపీ సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటన ఖరారు అయింది. సీఎం వైఎస్‌ జగన్‌ రెండు రోజుల పర్యటని నిమిత్తం ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా రేపు, ఎల్లుండి పలువురు కేంద్రమంత్రులతో సీఎం జగన్‌ భేటీ కానున్నారు. రేపు ఉదయం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగే పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో సీఎం జగన్‌ పాల్గొంటారు. అనంతరం 10 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి సీఎం జగన్‌ ఢిల్లీ వెళ్తారు. ఇదే నెలలో జగన్‌ రెండో సారి ఢిల్లీ పర్యటనకు వెళ్తుండటం గమనార్హం.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.