అమరావతి: రాజ్‌భవన్‌కు చేరుకున్న సీఎం వైఎస్ జగన్ దంపతులను గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, ఇతర అధికారులు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర పరిస్థితులను గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్‌కు సీఎం జగన్ వివరించనున్నారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై సీఎం జగన్ వివరించనున్నారు. సీఎం దంపతుల గౌరవార్థం రాజ్‌భవన్ సిబ్బంది భోజన ఏర్పాట్లను చేశారు.