సీఎం వైఎస్ జగన్ – చిరంజీవి భేటీని జీర్ణించుకోలేకపోతున్న జనసైనికులు

అమరావతి: ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ను సోమవారం రోజున మెగాస్టార్‌ చిరంజీవి దంపతులు కలిశారు. ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ నుంచి విజయవాడకి చేరుకున్న చిరంజీవి దంపతులు నేరుగా సీఎం జగన్‌ నివాసానికి వెళ్లారు. సీఎం క్యాంప్‌ ఆఫీసులో సీఎం జగన్‌ను చిరంజీవి శాలువతో సత్కరించారు. వైఎస్‌ జగన్‌ సీఎం అయిన తర్వాత చిరంజీవితో భేటీ కావడం ఇదే మొదటిసారి. అయితే సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ కావడాన్ని జనసైనికులు జీర్ణించుకోలేకపోతున్నారు. వీరిద్దరి భేటీపై సోషల్‌ మీడియా వేదికగా కామెంట్లతో జనసైనికులు మండిపడుతున్నారు. అయితే జనసేన పార్టీని పవన్‌ కల్యాణ్‌ ఒంటిచేత్తో నడిపిస్తున్నారు. ఇప్పుడు చిరంజీవి సీఎం జగన్‌ను కలవడంతో పవన్‌ కల్యాణ్‌ కొంత ఇబ్బందికరంగా ఉన్నారని జనసైనికులు బాధపడుతున్నారు. మరో వైపు చిరంజీవి జగన్ వైపు మొగ్గు చూపితే ఇక జనసేన పరిస్థితి అంతే అని ప్రజలు భావిస్తున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.