కర్ణాటక ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్‌

By సుభాష్  Published on  3 Aug 2020 6:48 AM IST
కర్ణాటక ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్‌

దేశంలో కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ కరోనా మహమ్మారి ఎవ్వరిని కూడా వదిలి పెట్టడం లేదు. సాధారణ ప్రజలతో పాటు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్న ప్రముఖులు, రాజకీయ నాయకులు సైతం కరోనా బారిన పడుతున్నారు. ముఖ్యమంత్రుల నుంచి కేంద్ర మంత్రుల వరకు ఎవ్వరిని వదిలిపెట్టడం లేదు.తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప (77)కరోనా బారిన పడ్డారు. ఆయన బెంగళూరులోని మణిపాల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

తన ఆరోగ్యం నిలకబడగా ఉందని, వైద్యుల సలహా మేరకు ఆస్పత్రిలో చేరినట్లు ఆయన ట్వీట్‌ చేశారు. అలాగే ఇటీవల తనను కలిసిన వారంతా ఎవరికి వారు స్వీయ నిర్బంధం పాటించాలని ఆయన కోరారు. ప్రజలంతా కరోనా బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. కాగా, కరోనా బారిన పడే నేతల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా సైతం కరోనా బారిన పడ్డారు.



Next Story